— నల్లగొండ లో స్పోర్ట్స్ అథారిటీ అధికారిక గీతాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
–12 వేల కు పైగా గ్రామాల్లో పండు గ వాతావరణంలో ఆటల పోటీలు
ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం అన్ని గ్రామాల్లో సీఎం కప్ మొదటి అంచె ఘనంగా ప్రారంభమైనాయి. శనివా రం నల్లగొండ పట్టణంలో జరిగిన ప్రజా పాలన ముగింపు వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పోటీలను లాంచనంగా ప్రారంభించారు.జిల్లా కలెక్టర్ల ఆధ్వ ర్యంలో వివిధ శాఖల సమన్వయం తో ఈ పోటీలు ఒక పండుగ వాతా వరణం లో ప్రారంభోత్సవాలు జరు పుకున్నాయి. ఆ తదుపరి జరిగిన బహిరంగ సభలో స్పోర్ట్స్ అథారి టీ అధికారిక గీతాన్ని కూడా ఆయ న ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోటీలలో పాల్గొంటున్న ప్రతి ఒక్క క్రీడాకారుడి సమాచారాన్ని సంక్షిప్తం చేసి భవిష్యత్తు అవసరాలకు విని యోగించాలని ముఖ్యమంత్రి అధి కారులను ఆదేశించారు. ఒక ఏడా దిలోనే ద్విగినీ కృత అభివృద్ధి సా ధించిన తెలంగాణ స్పోర్ట్స్ అథా రిటీని ఆయన అభినందించారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి సమన్వయం చేసిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమం త్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రు లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తంకు మార్ రెడ్డి దామోదర్ రాజనర్సింహ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు తోపాటు నల్గొండ జిల్లాకు చెందిన పలువురు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు స్థానిక సంస్థల నేతలు వివిధ జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు