ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సిఎం కప్ పోటీలలో భాగంగా నల్గొండలో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ బాలుర జూనియర్ విభాగంలో జిల్లాకు చెందిన దాసరి జయశీల్ కుమార్ 105 కిలోల కేటగిరీలో జిల్లాలో మొదటి స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికవ్వడం పట్ల ఆమె దాసరి జయసీల్ కుమార్ ను అభినందించారు.
ఆదివారం ఆమె తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయిలో సాధించిన మెడల్ ను జయాశీల్ కుమార్ కు అందజే శారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ జయా శీల్ కుమార్ ను అభినందిస్తూ రాష్ట్ర స్థాయిలో సైతం ప్రతిభ కనబర్చి జిల్లా కు పేరు తీసుకురావాలని అన్నారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి నర్సిరెడ్డి, చీఫ్ సెలెక్టర్ అష్రఫ్, కలెక్టర్ సి సి ప్రసాద్,తదితరులు ఉన్నారు.