ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఆసు పత్రుల్లో చికిత్స పొంది సీఎం సహాయ నిధికి ఎదురుచూస్తోన్న వారికి నల్గొండ పట్టణంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహా యం నిధికి అర్జీ పెట్టుకున్న బాధి తులకు విడుదలైన రూ. 8.67 లక్షల చెక్కులను గురువారం తన నివాసంలో సంబంధిత బాధిత కుటుంబాలకు అందించారు.
ఇకనై నా ప్రభుత్వం పేద ప్రజల పై పెద్ద మనసుతో సహాయనిధికి అర్జీ పెట్టుకున్న వారికి త్వరగా పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయాలని వారికి ఆసరాగా నిలవాలని కోరారు.