Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cm Revanth Reddy: నల్లగొండ మెడికల్ కళాశాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారం భించిన ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభు త్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవం లో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు, అధి కారులు, ప్రజాప్రతి నిధులు విద్యా ర్థులకు ఆఫ్రాన్లను ముఖ్యమంత్రి, మంత్రులు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నల్గొం డ జిల్లా కేంద్రంలో సుమారు 275 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిం చిన ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులు శని వారం ప్రారం భించారు.

ఈ సంద ర్భంగా ముందుగా వైద్య కళాశాల కు మంత్రులు, అధికారులతో కలిసి చేరుకున్న ముఖ్యమంత్రి కళాశాల భవనాన్ని, తరగతి గదులను రిమోట్ ద్వారా ప్రారంభించారు. అనంతరం కళాశాలను ప్రారంభిం చి లెక్చర్ హాలులో వెళ్లి వైద్య విద్యార్థులకు వైట్ కోట్స్ పంపిణీ చేశారు.నూతన వైద్య కళాశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, మంత్రులు వెళ్ళి విద్యార్థు లతో కలిసి బెంచీలపై కూర్చు న్నారు. ఈ సందర్భంగా ఎంబీబీ ఎస్ ద్వితీయ సంవత్సరం చదు వుతున్న నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన విద్యార్థిని చందు, ముఖ్య మంత్రితో ముఖాముఖి మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలలను నిర్మిస్తూ అందిస్తున్న వసతులు, సేవలపై ఆనందంగా ఉందని వివరించింది.

తాను బిసి గురుకుల పాఠశాలలో, కళాశాలలో చదివానని,వైద్య విద్య సైతం ప్రభుత్వ వైద్య కళాశాలలోనే చదువుతున్నానని ,నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో లైబ్రరీ, తరగతి గదులు ,అన్ని సౌకర్యాలు బాగున్నాయని, పేద విద్యార్థులకు వైద్య విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు.

బీహార్ రాష్ట్రానికి చెందిన విద్యార్థి ప్రశాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ఆల్ ఇండియా కోటాలో తనకు నల్గొండ కళాశాలలో సీటు వచ్చిందని, ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని సౌకర్యాలు బాగున్నాయని తెలుపగా, ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య విద్య తర్వాత బీహార్ వెళతావా,ఇక్కడే ఉంటావా? అని ప్రశ్నించగా తెలంగాణలోనే ఉంటానని ప్రశాంత్ కుమార్ సింగ్ బదులిచ్చాడు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రెవెన్యూ, హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ (ఐ అండ్ పీఆర్) శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎంపీలు కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీవాణి, ఇతర అధికారులు ,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.