–నిశిత నిఘా పెంచిన అధికార యంత్రాంగం
–సిఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆయా వర్గాలు
CM Revanth Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించా లని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించ డంతో జిల్లా అధికారుల్లో కదలిక వచ్చింది. అలాగే సిఎస్ కూడా సవిూ క్షించి కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పరిస్థితి చక్కదిద్దే పనిలో పడ్డారు అధికారు లు. ఇసుక అందుబాటులో లేక ఏడాదిగా నిలిచిపోయిన నిర్మాణ పనులు పుంజుకునే అవకాశాలు న్నాయి. ఇసుక రీచ్‌లను గుర్తించేం దుకు విూనమేషాలు లెక్కపెట్టిన మైనింగ్ అధికారులు అక్రమ దందాను అడ్డుకునేందుకు తమ శాఖలో సరిపడా స్టాఫ్ లేదని చెబు తూ వచ్చారు. దీంతో జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రభుత్వ భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకూ ఇసుక కొరత తప్పలేదు. సామాన్య, మ ధ్య తరగతి ప్రజలు ఇండ్లు కట్టుకో వడానికి ఇసుక అందుబాటులో లేక తిప్పలు పడ్డారు. ఇదే అద నుగా ట్రాక్టర్‌కు రూ.6,500, టిప్ప ర్‌కు రూ.60 వేల చొప్పున ఇసుక మాఫియా వసూలు చేయడంతో నిర్మాణం రంగం కుదేలైంది.డిరడి పరివాహక పరిసర ప్రాంత గ్రామా ల్లో పగలు రాత్రి అంటూ తేడా ఉం డదు. దుందుభి నది పరివాహక గ్రామాల్లో జేసీబీలను వాగుల్లోకి దింపి ఇసుకను తోడేస్తున్న మాఫియా, ఇసుకను జిల్లా సరిహ ద్దులు దాటించి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
ఇక ఇసుక తరలి స్తున్న గ్రామాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. పార్టీలు, గ్రూపుల వారీగా ఇసుకను తరలించేందుకు పోటీ పడుతు న్నాయి. అధికారుల చర్యలతో పరివాహక ప్రాంత గ్రామాల్లో ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్ల నుంచి విముక్తి దొరుకుతుందని ఆయా ప్రాంత రైతులు అంటున్నారు. డిరడి వాగు మాఫియాకు అడ్డాగా మారింది. మిడ్జిల్, తాడూరు, తిమ్మాజీపేట, తెల్కపల్లి, వంగూరు, కల్వకుర్తి, ఉప్పునుంతల మండలాల నుంచి అడ్డగోలుగా ఇసుక తరలిస్తున్నా మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారు. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల్లోని చిన్నా చితక వాగులను వదలని ఇసుక మాఫియా పొలిటికల్? సపోర్ట్?తో వాగులను తోడేస్తున్నా పట్టిం చుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇసుక దందాకు అడ్డుక ట్ట పడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం నేలచూపులు చూస్తున్న విషయ విదితమే. దీనికితోడు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకు లు ఇష్టారాజ్యంగా ఇసుక తోడే స్తుండటం, అధికారులు, కాంట్రాక్ట ర్లు వారితో మిలాఖతై ఇసుక దోపిడీకి తెరలేపడం ఆదాయంపై తీవ్రంగా ప్రభావం చూపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫలితంగా టీజీఎండీసీ ఆదాయం గణనీయంగా పడిపోయింది. పరిస్థితి ఇలాగే ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే మళ్లీ పునరావృతమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇసుక ఆదాయాన్ని రూ.832 కోట్లకు పెంచాలని టీజీఎండీసీ ల క్ష్యంగా పెట్టుకున్నది. ఇసుక రీచ్‌ల వద్ద మూ డు షిఫ్టుల్లో పనిచేసే విధంగా ప్రణాళికలు రూ పొందించింది. అయితే, కంచె చేను మేసిన చందంగా మైనింగ్, రవాణా, విజిలెన్స్ విభాగం అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ లక్ష్యాన్ని అందుకుంటుందా అన్నది చూడాలి.డిరడి వాగులో ఇసుకను తోడే ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఇసుక తోడేందుకు వాడే హిటాచీ, జేసీబీలు, రవాణకు వాడే ట్రాక్టర్లు, టిప్పర్లను సీజ్ చేసి సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
ఇసుకతో పాటు మైనింగ్ దందాకు అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు. ఇసుక దందాను అడ్డుకునేందుకు డీఎస్పీ నేతృత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. మైనింగ్ శాఖ గుర్తించిన రీచ్ ల నుంచి సాండ్‌ట్యాక్సీ ద్వారా ఇసుక వినియోగానికి అనుమతులు ఇవ్వనున్నారు. అధికారికంగా గుర్తించిన ఇసుక రీచ్‌ల వద్ద మైనింగ్, రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. బుక్ చేసిన ట్రాక్టర్లకు కూలీలతో ఇసుక తవ్వుకునేలా నిబంధనలు విధించారు.రు. ఇసుక తవ్వకాలకు సాయంత్రం 5 వరకు సమయం కేటాయించి, బుక్ చేసుకున్న వారు రీచ్‌ల వద్ద కూపన్లను ఇస్తే ఇసుక తరలించడానికి అనుమతిస్తారు.