CMRF: ప్రజా దీవెన, నల్లగొండ: జిల్లాలో వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ (Private Hospitals)లో చికి త్స పొందిన 23 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిది పథకం (The scheme is of Chief Minister’s assistance)ద్వారా మంజూరు అయి న రూ. 8,56,500-విలువ గల చెక్ లను మంగళవారం నల్గొండ పట్ట ణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy)అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్య మంత్రి సహాయనిధీ ( CMRF) పథకం నిరుపేదలకు వరం లాంటిది అన్నారు.
ఈ పథకం ద్వారా లక్షలా ది మంది పేదలకు సహాయం అందు తుందని చెప్పారు. సీఎం ఆర్ ఎఫ్ పథకాన్ని (cmrf) ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపో యిన చెక్ లను రిలీజ్ చేసి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు సహాయం చేశారన్నారు. ఈ పథకాన్ని నిర్విరామంగా కొనసా గిస్తూ పేద ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి రజిత వెంకట్ రెడ్డి , పాదురి ఇంద్రసేనా రెడ్డి , నాగుల వంచ వెంకటేశ్వర రావు , సైదులు గౌడ్ ,సత్య నారాయణ, బొంత శ్రీను, యాదగిరి,తదితరులు పాల్గొన్నారు.