Ballot paper: బ్యాలెట్ పేపర్ పరిశీలించిన కలెక్టర్
లోక సభ ఎన్నికల లో భాగంగా నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న బ్యాలెట్ పేపర్ పరిశీలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి చందన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: లోక సభ ఎన్నికల లో(Lok sabha elections) భాగంగా నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న బ్యాలెట్ పేపర్(ballot paper) పరిశీలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి చందన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్యాలెట్ పేపర్ పరిశీలన పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తూ బ్యాలెట్ పేపర్ తో పాటు, సంబంధించిన రిజిస్టర్లు, ఇతర సామాగ్రి అన్నిటిని పరిశీలించారు. నల్గొండ పార్లమెంటు నియోజ కవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ పరిశీలన ఇక్కడ కొనసాగు తుండగా, ఇక్కడి నుండి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు లోక సభ ఎన్నికల బ్యాలెట్ పేపర్ ను సామాగ్రి ని పంపించడం జరు గుతుంది.జిల్లా కలెక్టర్ వెంట నల్గొండ ఆర్డిఓ రవి, తహసిల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
collector examined ballot paper