ప్రజాదీవెన, నల్గొండ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నల్గొండ జిల్లా తిప్పర్తి మండలానికి జూనియర్ కళాశాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.కాగా జూనియర్ కళాశాల భవన నిర్మాణ స్థల సేకరణ విషయమై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం తిప్పర్తి మండల కేంద్రంలో పర్యటించి పలు ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు.ముందుగా సర్వేనెంబర్ 515, 516 లో మోడల్ స్కూల్ పక్కన ఉన్న 3 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ కళాశాల భవన నిర్మాణానికి తనిఖీ చేశారు. అనంతరం 827 సర్వేనెంబర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న 555 556, 560 సర్వే నెంబర్లలో ఉన్న స్థలాలను ఆమె పరిశీలించి రెవెన్యూ అధికారులకు సూచనలు చేశారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు అనువైన స్థలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేయాల్సి ఉందని, గుర్తించిన స్థలాలకు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని తహసిల్దార్ పుష్పను ఆదేశించారు
జిల్లా కలెక్టర్ వెంట మండల స్పెషల్ ఆఫీసర్,మార్కెటింగ్ ఎ డి ఛాయాదేవి, ఎంపీడీవో వెంకటరమణారెడ్డి తదితరులు ఉన్నారు.