Collector Tripati: ప్రజా దీవెన, నల్లగొండ: విద్యార్థినులు బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు . గురువారం ఆమె నల్గొండ జిల్లా, కనగల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినిలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, వారికి నోట్ పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లను పంపిణీ చేశారు.
జిల్లా కలెక్టర్ విద్యార్తినిలతో ముఖాముఖి మాట్లాడుతూ బాగా చదువుకోవాలని, జీవితంలో ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలని చెప్పారు. కేజీబీవీ పాఠశాలతో పాటు, పరిసరాలను, వంటగది అన్నింటిని శుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా భోజనం నాణ్యతగా ఉండాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని, భోజనం నాణ్యతగా ఉండాలని, విద్యార్థినిలకు గుణాత్మక విద్యను అందించాలని ఆమె సూచించారు.
కాగా ఈ కేజీబీవీలో సుమారు 230 మంది విద్యార్థినులు ఉండగా, తరగతి గదుల కొరత ఉందని,గతంలో పాఠశాల సందర్శన సందర్భంగా గమనించిన జిల్లా కలెక్టర్ పై భాగంలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పడమే కాకుండా, అదనపు తరగతి గదులను మంజూరు చేయించినట్లు తెలిపారు. త్వరలోనే ఆదనపు తరగతి గదుల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట తహసిల్దార్ పద్మ ,ఎంపీఓ సుమలత, ఎంఈఓ పద్మ తదితరులు ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
