ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : టీఎన్జీవోస్ యూనియన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ ను, అడిషనల్ కలెక్టర్ ను, ఎస్సీ ఎస్టీ బీసీ జిల్లా సంక్షేమ అధికారులను తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం, నల్గొండ జిల్లా తరఫున మర్యాదపూర్వకంగా కలిసి ఎస్సీ, ఎస్టి, బీసీ సంక్షేమ వసతి గృహాలలో ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించి ఇచ్చిన కామన్ మెనూ అమలుకు సంబంధించిన విషయాలపైన మరియు క్షేత్రస్థాయిలో నూతన మెనూ ను అమలు పరచడంలో ఉన్న సమస్యల పైన మరియు కల్పించాల్సినటువంటి సదుపాయాల పైన వినతి పత్రంను అందజేయడం జరిగినది.
ఇట్టి కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాగిళ్ళ మురళి, సెక్రటరీ జే.శేఖర్ రెడ్డి, సెంట్రల్ టీఎన్జీవో కార్యవర్గ సభ్యులు వంగూరి విజయకృష్ణ, టీఎన్జీవోస్ జిల్లా ఉపాధ్యక్షులు డిఐ రాజు, ఎస్సీ డిపార్ట్మెంట్ ఉద్యోగులు గోవర్ధన్, జైపాల్ మరియు వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు భీమా గాని రణదీవే,
కార్యదర్శి జి సత్యనారాయణ, ట్రెజరర్ సైదా నాయక్,హెచ్ డబ్ల్యు ఓ లు డి స్వామి, కొల్లు బాలకృష్ణ, రామకృష్ణారెడ్డి, రమ్య సుధా, సుమలత, జ్యోతి, సునీత, కమల, నరసింహారాజు, వీరాంజనేయులు, సుమన్, సైదులు తదితరులు పాల్గొన్నారు