Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Collector Tripati: ముఖ్యమంత్రి రాక సందర్భంగా అవసరమైన ఏర్పాట్లు పరిశీలన

ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : ఈనెల 7న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం రానున్నందున రాష్ట్ర ముఖ్యమంత్రి రాక సందర్భంగా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రాక ఏర్పాట్ల విషయమై ముందుగా ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, రెవిన్యూ, పోలీస్,ఇరిగేషన్,తదితర అధికారులతో సమావేశం నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యే ప్రదేశాలు, అక్కడ చేయవలసిన ఏర్పాట్లు ,పోలీస్ బందోబస్తు, తదితరు అంశాలపై చర్చించారు.

తర్వాత నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలకు వెళ్లి వైద్య కళాశాల ప్రారంభానికి కావలసిన ఏర్పాట్లు ,విద్యార్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖి ,వైట్ కోట్ వేరింగ్ సెర్మనీ ఏర్పాట్లపై తగు సూచనలు జారీ చేశారు.అనంతరం స్థానిక రైతుబజార్ వద్ద శంకుస్థాపన చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం,మున్సిపల్ అభివృద్ధి పనుల శంకుస్థాపన ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లు, డయాస్, బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలకు, విఐపిలకు ఏర్పాట్లు, హెలిప్యాడ్ తదితర అంశాలను పరిశీలించారు.ఆ తర్వాత ఉదయ సముద్రం ఎత్తిపోతల కింద బ్రాహ్మణ వెళ్లెముల రిజర్వాయర్లోకి డెలివరీ ఛానెల్ ద్వారా నీరు వదిలెందుకు చేసిన ఏర్పాట్లు, హెలిప్యాడ్, పైలాన్ ను, అలాగే డెలివరీ ఛానల్ ద్వారా రిజర్వాయర్ లోకి వచ్చే నీటి ప్రదేశాన్ని పరిశీలించారు.

అక్కడే మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి,ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈనెల 7న జిల్లాకు రానున్నారని తెలిపారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రాహ్మణ వెల్లేముల ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కింద బ్రాహ్మణ వెళ్లెముల డెలివరీ చానల్స్ ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం దామరచర్ల మండలం వై టి పి ఎస్ యూనిట్ -2 ను ప్రారంభించనున్నారని, అలాగే మెడికల్ కళాశాల ప్రారంభం ,నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన, మున్సిపాలిటీ లో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు.

ఇందుకు సంబంధించి అవసరమైన ముందస్తు సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే అన్ని శాఖల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రాక కోసం అవసరమైన ఏర్పాట్లు అన్ని చేస్తున్నామని వెల్లడించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి 7 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా బ్రాహ్మణ వెల్లేముల చేరుకుంటారని, ఆక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత వైటిపిఎస్ వెళతారని,ఆ తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభం,ఇతర కార్యక్రమాలకు శంకుస్థాపన,ఎం జి కళాశాల మైదానములో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.

సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రాక సందర్భంగా అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ఇందుకుగాను నల్గొండ జిల్లా పోలీస్ సిబ్బందిని, అధికారులను ఆయా కార్యక్రమాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నూటికి నూరు శాతం బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు.అదనపు జె సి.శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఇరిగేషన్ సి ఈ అజయ్ కుమార్,ఎస్ ఈ శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు,నల్గొండ ఆర్డీవో అశోకె రెడ్డి,డి ఎస్ పి శివరాం రెడ్డి, రెవెన్యూ ,పోలీస్ అధికారులు , తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు .