— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collector Tripati: ప్రజా దీవెన, నల్లగొండ: ఆంగ్ల నూతన సంవత్సరం 2025 లో నల్గొండ జిల్లాకు మంచి పేరు, ప్రఖ్యాతలు తీసుకొచ్చేలా అధి కారులు, సిబ్బంది పని చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. 2025 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆమె జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలి యజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, సిబ్బంది జిల్లా కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్చాలను, పూల మొక్కలు, బెడ్ షీట్లు, నోట్ పుస్త కాలు అందజేసి నూతన సంవ త్సర శుభాకాంక్షలు తెలియజే శారు.
నల్గొండ జిల్లాలో సమర్థవం తులైన, బాధ్యత కలిగిన అధికా రులు, సిబ్బంది ఉన్నారని, అందువల్లనే గత సంవత్సరం ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్లు,సామాజిక, ఆర్థిక ,రాజకీయ, సమగ్ర కుటుంబ సర్వే వంటి అంశాలలో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని, ఇందుకు కృషి చేసిన మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, జిల్లా అధికారులను ఆమె అభినందించారు. ఇదే వరవడిని నూతన సంవత్సరం 2025లో సైతం కొనసాగించి నల్గొండ జిల్లా చరిత్రలో మిగిలిపోయే విధంగా పనులు చేయాలని అన్నారు. నల్గొండ జిల్లాలో అన్ని వనరులు ఉన్నాయని ,నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు అధికారులు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటు చేసుకొని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని ఆమె సూచించారు. ప్రతి అధికారి, సిబ్బంది వారి వారి పనులలో ప్రతిరోజు పురోగతి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం అన్ని అంశాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకు జిల్లా యంత్రాంగం తరఫున ఉద్యోగులకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు, సలహాలతో పాటు, సహకారాన్ని అందజేస్తామని తెలిపారు .
అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగమంతా పూర్తి బాధ్యతతో పనిచేస్తున్నదని, ఇందులో భాగంగానే గత సంవత్సరం దాన్యం సేకరణ, సమగ్ర కుటుంబ సర్వే ,ఇందిరమ్మ ఇండ్లు వంటి కార్యక్రమాల్లో జిల్లాను ముందు వరుసన నిలపడం జరిగిందని, 2024 లో పని చేసినట్లుగానే 2025 సంవత్సరం లో అధికారులు, సిబ్బంది అందరూ ఇంకా కష్టపడి పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా రెవెన్యూ అధికారి అమరేందర్, ఆర్డీవోలు అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. జిల్లా గజిటెడ్ అధికారుల సంఘం ద్వారా అనాధలు, వృద్ధాశ్రమంలో ఉండే వృద్ధుల ప్రయోజనార్థం సుమారు 7000 రూపాయల విలువ చేసే బెడ్షీట్లను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో, జిల్లా అధికారుల సంఘం పూర్వ అధ్యక్షులు ఎండి ముసిబుద్దిన్ జిల్లా కార్యదర్శి బాలరాజు రెడ్డి అసోసియేట్ అధ్యక్షులు అమరేందర్ గౌడ్ ట్రెజరర్ సందీప్ రెడ్డి ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీలు, జిల్లా అధికారులు, కార్యవర్గ సభ్యులు కలెక్టర్ కార్యాలయం ఏవో మోతిలాల్ హాజరయ్యారు.