— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collector Tripati: ప్రజా దీవెన, నల్గొండ: ధరణి పోర్టల్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్నారు. గురువారం అమె నల్గొండ జిల్లా, నాంపల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి పోర్టల్ లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించారు.
టి ఎం -33 మాడ్యూల్ లో ఉన్న పార్టిషన్,సక్సేషన్ తదితర భూములకు సంబంధించిన అన్ని కేసులను వేగవంతం చేసి పరిష్కరించాలని చెప్పారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే వాటికి ఆర్ఐ, సర్వేయర్లు దరఖాస్తుదారునితో పాటు, క్షేత్రస్థాయికి వెళ్లి జియో కో-ఆర్డినేట్స్ తో సహా వివరాలను సమర్పించి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ను ఆదేశించారు. ఎంపీడీవోతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల సర్వే నాణ్యతగా ఉండేలా చూడాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా భూమి సమస్యల పరిష్కారానికై తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన టిపి గౌరవరం రైతులు ఎల్లూరు నారాయణరెడ్డి, ఎల్లురి వెంకటరెడ్డి లతో మాట్లాడి వారికి సంబంధించిన భూ సమస్యల దరఖాస్తులను స్వీకరించారు .అంతేకాక కొన్ని దరఖాస్తుల పరిష్కారం పై ఆర్డీవోతో ఫోన్లో మాట్లాడి తక్షణ పరిష్కారం సూచించారు. తహసిల్దార్ జి. దేవ సింగ్, ఎంపీడీవో స్వర్ణకుమారి, సిబ్బంది, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.