— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collector Tripati: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ మున్సిపల్ పరిధిలో ఈ- వేస్ట్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ- వేస్ట్ ప్లాంట్ ఏర్పాటు విషయమై శుక్రవారం ఆమె మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఈ- వేస్ట్ మేనేజ్మెంట్ ప్రతినిధి విజయకుమార్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో తన చాంబర్లో సమీక్షించారు.
ముఖ్యంగా పనికి రాని ఎలక్ట్రానిక్ సామాగ్రిని ఎక్కడపడితే అక్కడ పడవేయడం వల్ల పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని,దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడతాయని,ఇలాంటి పనికి రాని ఎలక్ట్రానిక్ వెస్ట్ ను సరైన విధంగా తొలగించేందుకు ఈ- వేస్ట్ మేనేజ్మెంట్ బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇందులో భాగంగా పనికిరాని ఎలక్ట్రానిక్ డివైస్లను ఇళ్ళు, వ్యాపారులు, సంస్థల నుంచి సేకరించడం ,అలా సేకరించిన ఈ- వేస్ట్ అంతటిని వేరువేరుగా చేసి తిరిగి ఉపయోగించే వాటిని వేరుగా చేయడం ,వాటి అన్నింటిని ఎలాంటి ప్రమాదం లేకుండా భద్రతగా డిస్పోస్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో భాగంగా ఆయా పట్టణాలలో ఏర్పాటు చేసిన ఈ- వేస్ట్ ప్లాంట్ల పై అధ్యయనం చేసిన తర్వాత నల్గొండలో సైతం ఈ- వేస్ట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆమె ఈ -వేస్ట్ మేనేజ్మెంట్ ప్రతినిధులతో సమీక్షించారు.
ఇందులో భాగంగా ముందుగా ప్రజలకు ఈ- వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన కల్పించడం, ఈ -వేస్ట్ రీసైకిలింగ్ చేయడం దాని ప్రాముఖ్యతను తెలియజేయడం వంటి అంశాలతో పాటు, ఇలా చేయడం వల్ల కలిగే లాభాలు, కాలుష్యాన్ని అరికట్టడం వంటివి చేయవచ్చని తెలిపారు. ఈ- వేస్ట్ ప్రతినిధి విజయ్ కుమార్, నల్గొండ ఆర్డిఓ వై.అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, ఈ -వేస్ట్ మేనేజ్మెంట్ నుండి జూనియర్ సైంటిస్ట్ రాజేష్, తదితరులు హాజరయ్యారు.