Comprehensive Employees: ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ కలెక్టరేట్ ముందు 26వ రోజు నిరవధిక సమ్మె కొనసాగింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కి మరియు వివిధ మంత్రులకు ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోలుగూరి కృష్ణ బొమ్మగాని రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్ష హోదాలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ చేయాలని లేని పక్షంలో తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని కోరారు. నిన్నటి రోజున మీడియా ముఖంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయడం కుదరదు అని ముఖ్యమంత్రి మాట్లాడటం బాధాకరమని మాట ఇచ్చి ఇలా మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తున్నామని, రెగ్యులర్ చేయటం సాధ్యం కానప్పుడు తక్షణమే పే స్కేల్ ఇవ్వాలని విద్యార్థుల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
దీక్షకు మద్దతుగా హై కోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ , ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శోభన్ బాబు హాజరైనారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచర్ల మహేందర్, క్రాంతి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్, ఎమ్ నీలాంబరి, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి. సావిత్రి , కోశాధికారి పుష్పలత, సాయిలు , ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు, ఇటికాల రమేష్, ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు,బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు,ధార వెంకన్న, శ్రీనివాస్, వి రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య, భిక్షం, బిక్షమా చారి, మొయిజ్ ఖాన్, పరమేశ్,నాగభూషణం చారి, రహీం, పాండు నాయక్, జానయ్యా, చంద్రమౌళి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.