Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Balu Naik: పేదల కోసం పుట్టిందే కాంగ్రెస్

దేశాన్ని పారదర్శకంగా,లౌకికంగా నడపాలం టే కాంగ్రెస్ పార్టీ ఉండాలి, కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టే బిజెపినీ బొందపెట్టాలని దేవరకొండ శాసన సభ్యుడు బాలు నాయక్ కోరారు.

దేవరకొండ శాసన సభ్యుడు బాలు నాయక్

ప్రజా దీవెన దేవరకొండ: దేశాన్ని పారదర్శకంగా,లౌకికంగా నడపాలం టే కాంగ్రెస్ పార్టీ ఉండాలి, కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టే బిజెపినీ బొందపెట్టాలని దేవరకొండ శాసన సభ్యుడు బాలు నాయక్(MLA Balu Naik) కోరారు. దేవరకొండ పట్టణ కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ భారీ రోడ్ షో ఆయన పాల్గొని ప్రసం గించారు.పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్(congress), తెలంగాణ తల్లి సోనియమ్మ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని తెలిపారు.
రాజ్యాంగాన్ని మారుస్తాం అనే బిజెపికీ ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. దేవరకొండ దేశాన్ని కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే బిజెపి పార్టీకి ఓటు వేస్తే మనల్ని మనం మోసం చేసినట్టే అని అన్నారు. దేశంలో ప్రజాస్వా మ్యాన్ని కూని చేసి పదేళ్ల మోడీ పాలనలో దేశాన్ని కుల మతాల మధ్య చిచ్చు పెట్టి అజ్ఞానం వైపు నడిపించిన బీజేపీ పార్టీని దేశంలో ఓడించాల్సిన అవసరం దేశ ప్రజల కు ఉందని అన్నారు. రాష్ట్రంలో నియంత పోకడ కేసీఆర్ ప్రభుత్వా న్ని ఎలా ఓడించారో దేశంలో కార్పొ రేట్ వ్యవస్థకు కొమ్ముకాస్తున్న బిజె పి పార్టీనీ ఓడించాలని కోరారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బిజెపికి బీటీంగా మారిందని. బి ఆర్ ఎస్ పార్టీకి ఓట్లు వేయడం వల్ల వృథా అయ్యే ఓటు తప్పితే ఫలితం లేదని పేద వర్గాలు అభివృద్ధిలో ముందు కు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి రావాలని కాబట్టి ప్రతి ఒక్క రు నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి(Raghuveer reddy) ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించా లంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అందుకు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress party) పార్టీ ఎన్నికల హామీలో ఇచ్చిన ఆరు గ్యారంటీలో ఐదు గ్యారెంటీలు అమలు అయ్యాయని అలాగే ఇచ్చిన హామీలో రుణ మాఫీ కూడా ఆగస్టు 15వ లోపల చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అని అందుకు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రఘువీర్ రెడ్డిని గెలిపించాలి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నాకు దేవరకొండ మండలం నుండి మెజార్టీ(Majority) ఇచ్చి గెలిపించారని అందుకు మీ అందరికీ రుణ పడి ఉంటామని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Congress born for poor