Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Congress Govt: యువతను మోసం చేసిన కాంగ్రెస్

అబద్ధపు హామీలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ప్రజలను, యువతను మోసం చేసింది. యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం.

హామీలు అమలు చేయకుండా ఎన్నికల్లో గెలిపించాలనడం సిగ్గుచేటు

నరేంద్ర మోడీ ప్రధాని కావాలంటే సైదిరెడ్డిని గెలిపించాలి

గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి

యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్

ప్రజా దీవెన నల్లగొండ:  అబద్ధపు హామీలు చెప్పి కాంగ్రెస్(congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ప్రజలను, యువతను మోసం చేసింది. యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం. ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్ ఆరోపించారు.నల్లగొండ జిల్లా బీజేవైఎం యువ మోర్చా (BJYM Yuva Morcha)ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నమో యువ సమ్మేళన కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యువతను తప్పుదోవ పట్టించి నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాల అవకాశాలు కల్పించకుండా తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

6 పథకాలు అమలు చేస్తామని చెప్పి అమలు చేయకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థులను గెలిపించాలని కోరుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.ఎలక్షన్ల తర్వాత నోటిఫికేషన్లు, ఉద్యోగ అవకాశాలు కల్పించకుంటే యువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి నోటిఫికేషన్ ఏపించే విధంగా పోరాటం చేస్తామని అన్నారు. నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా(Make in india) తో యువతకు యెన్నో అవకాశాలు కల్పిస్తూన్నారని, ఖేలో భారత్ పేరుతో మహిళలకు, పిల్లలకు, యువతకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

కేంద్రంలో నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రి కావాలంటే నల్లగొండ నుండి పోటీ చేసే శానంపూడి సైదిరెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ కు పంపించే విధంగా యువత కంకణ బద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ముందుండి ప్రచారం చేసి ప్రతి పథకాన్ని ప్రజలకు తెలియజేసి ఓటు వేయించే బాధ్యత యువతపై ఉన్నదని, తొమ్మిది రోజులు కలసికట్టుగా పనిచేసి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు వంగూరి రాకి మాట్లాడుతూ నల్లగొండ గడ్డ పోరాటాల అడ్డా. నల్లగొండ గడ్డపై కాషాయపు జెండా ఎగర వేయడమే లక్ష్యంగా యువత కసితో పనిచేసి నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

నల్లగొండ పార్లమెంట్(Nalgonda Parliament) అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ యువత దేశానికి ఆదర్శం యువత తలచుకుంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు.యువత చెడు అలవాట్లకు అలవాటు కాకుండా విద్యాతో పాటు రాజకీయ రంగంలో రాణించాలని సూచించారు
ప్రభుత్వం ఏర్పడగానే యువతకు 50 వేల ఉద్యోగ అవకాశలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారసత్వ రాజకీయాలకు నాంది పలకాలని యువతకు సూచించారు. నల్లగొండలో వారసత్వ రాజకీయాలు తప్ప నిరుద్యోగులను పట్టించుకునే నాధుడు లేడని విమర్శించారు. జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుటుంబాలలో కుటుంబ రాజకీయం తప్ప నిరుద్యోగుల గురించి ఏ ఒక్క రోజు కూడా వారు మాట్లాడలేదని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ కు దమ్ము, ధైర్యం లేక ఇచ్చిన హామీలు అమలు చేయలేక జనం ముందుకు మళ్ళీ ఓట్లని అడగడానికి వస్తున్నారని, వారికి తగిన బుద్ధి చెప్పి దేశంలో బిజెపి 400 సీట్లు తో గెలుస్తుందని, అందులో నల్లగొండ ఉండబోతుందని తెలిపారు.ప్రపంచంలో దేశం నెంబర్ వన్ కావాలంటే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. నల్లగొండలో కాషాయ జెండా ఎగరేయాలని, అదే లక్ష్యంగా యువత పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి అసలు సిసలైన గట్టి పట్టు గల వారు యువమోర్చా కార్యకర్తలని అన్నారు. యువత తలుచుకుంటే సాధించనిది ఏదీ లేదని, మోడీ ని మూడవసారి ప్రధానమంత్రిని చేయాలని, నలగొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ని గెలిపించడమే లక్ష్యంగా యువత ముందుండి పని చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, యువమోర్చ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కట్కూరు కార్తిక్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మదగోని శ్రీనివాస్ గౌడ్, పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు, పార్లమెంట్ ప్రభారీ చాడ శ్రీనివాస్ రెడ్డి, యువమోర్చా ప్రధాన కార్యదర్శి చామల పవన్ రెడ్డి, యువమోర్చా పార్లమెంట్ ప్రభారీ నీలకంఠం పాండు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి, కంకణాల నివేదిత రెడ్డి, చెల్లా శ్రీలత రెడ్డి, లాలూ నాయక్, చిల్లంచర్ల అభి, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రెవల్లి కిరణ్, బుడిగ భరత్, నేరెళ్ల అజయ్, పట్టణ అధ్యక్షులు దుబ్బాక సాయి, చిట్యాల గోపిరెడ్డి, శాంతిస్వరూప్, అనుముల దేవి, యువనాయకులు పాల్గొన్నారు.

congress government cheated youth