Jagadish Reddy: రైతులకు కన్నీళ్ళు మిగిల్చిన కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కన్నీళ్లు మిగిల్చారు తప్ప వారి కష్టాలను తీర్చలేదని ఆరోపించారు.
హామీల అమలులో ప్రభుత్వం వైఫల్యం
మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
ప్రజా దీవెన, మర్రిగూడ: కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కన్నీళ్లు మిగిల్చారు తప్ప వారి కష్టాలను తీర్చలేదని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Jagadish Reddy)తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. మర్రిగూడ మండల కేంద్రంలోని భారతి గార్డెన్ లో మర్రిగూడ, నాంపల్లి తో పాటు చండూరు మండలాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాలు మంగళ వారం భువనగిరి బీఆర్ఎస్(BRS) ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ (Telangana)అభివృద్ధి చెందింది కేసీఆర్తోనేనని, రాష్ట్ర ప్రజలు కేసీఆర్(KCR) పాలననే కోరు కుంటు న్నారని అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పల్లె రవికుమార్ గౌడ్, పాల్వాయి స్రవంతి, ఇన్చార్జి ఎంపీపీ కట్కూరి వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీపీలు, బూడిద భిక్ష మయ్యగౌడ్, చండూరు మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళ, సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ వెంక టనారాయణగౌడ్, రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతిరెడ్డి, మునగాల నారాయణరావు, గుర్రం వెంకటరెడ్డి, జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ఎంపీపీ అవ్వారి గీత తదితరులు పాల్గొన్నారు.
Congress govt failed in Telangana