Kunduru Raghuveer Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజా సంక్షేమం
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే ప్రజల సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుండి పట్టణంలో నల్గొండ కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి కుందూరు. రఘువీర్ రెడ్డి తో కలిసి ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ని గెలిపించండి
కోదాడ ఎమ్మెల్యే , పద్మావతి రెడ్డి
ప్రజా దీవెన కోదాడ: కాంగ్రెస్ ప్రభుత్వం తోనే ప్రజల సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి (Nalamada padmavathi reddy)అన్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుండి పట్టణంలో నల్గొండ కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి తో(Kunduru Raghuveer Reddy)కలిసి ప్రచారం నిర్వహించారు. పట్టణంలో కటకమ్మ గూడెం రోడ్డులో మార్నింగ్ వాకింగ్ కి వెళ్లే వారిని బాయ్స్ హై స్కూల్ లో క్రీడాకారులను హుజూర్నగర్ రోడ్డు లోని జగ్గు భాయ్ టీ స్టాల్ వద్ద ఓటర్లతో కలిసి టీ తాగుతూ హస్తం గుర్తుకు ఓట్లు వేసి రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
టీ స్టాల్ నిర్వాహకులు జగ్గు భాయ్ నుటీ చాలా బాగుందంటూ అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలో ఐదు అమలు చేశామన్నారు. కాంగ్రెస్ (congress)పార్టీ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల. లక్ష్మీనారాయణ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల. కోటేశ్వరరావు,వంగవీటి. రామారావు,సంపేట.రవి, పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏటుకురి. రామారావు, ప్రముఖ వ్యాపారులు ఉప్పలవంచు. శ్రీనివాసరావు, సుందరి. వెంకటేశ్వర్లు, గంధం. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Congress govt implement welfare schemes