Jagadeesh Reddy: సాగర్ ను ఎడారిగా మార్చిన కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలి
నాగార్జున సాగర్ ఆయకట్టు ను ఎడారిగా మార్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.
నీళ్లు వున్నా, కాంగ్రెస్ నాయకుల అలసత్వం, ఉదాసీనత వల్ల ఆయకట్టు సర్వనాశనం అయింది
కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే కు తల తోక తెలియదు
మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
ప్రజా దీవెన నల్గొండ: నాగార్జున సాగర్ ఆయకట్టు ను ఎడారిగా మార్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadeesh Reddy) పిలుపునిచ్చారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కృష్ణా రెడ్డి కి మద్దతుగా సాగర్ నియోజకవర్గంలో ని గుర్రంపోడ్, కనగల్ లో ఆదివారం నిర్వహించిన రోడ్ షో లో జగదీష్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సాగర్ ప్రాజెక్టు లో నీళ్లు వున్నా, కాంగ్రెస్ నాయకుల అలసత్వం, ఉదాసీనత వైఖరి వల్ల ఆయకట్టు అంతా సర్వనాశనం అయిందని అన్నారు.సాగర్ లో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే కు తల తోక తెలియదని, ఎందుకు గెలిపించారో ఎవ్వరికీ అర్థం కావడం లేదని జగదీష్ రెడ్డి ఎద్దేవ చేశారు.
కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు సాగర్(Nagarjuna sagar) ఆయకట్టు కింద చివరి భూములకు నీళ్లు అందించామని, ఒక్క ఎకరం కూడా ఎండనివ్వలేదని అన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతూ, రైతులను ఇబ్బందులు పెట్టిందని అన్నారు. ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరారు.ఈ ప్రచారంలో ఎంపీ అభ్యర్థి కృష్ణా రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు భగత్, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Congress turned Sagar into desert