Congress:కాంగ్రెస్ ప్రభం’జనం’ రెండు స్థానాల్లో జయకేతనం
ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పంచుకోట అని మరోసారి నిరూపితమైంది. గడిచిన ఆరు మాసాల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగింది.
నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ల లో హస్తం పాగా
తెలంగాణలోనే అల్ టైంగా నల్ల గొండలో రఘువీర్ రికార్డు మెజార్టీ
భువనగిరిలో చామల 2,22,170 ఓట్ల ఆధిక్యంతో విజయభేరి
ప్రజా దీవెన, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పంచుకోట అని మరోసారి నిరూపితమైంది. గడిచిన ఆరు మాసాల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections)కూడా కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేట మినహా 11 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మె ల్యేలు గెలుపొందితే ఎంపీ ఎన్నికల్లో గతంలోని రెండింటికి రెండు స్థానా లు నిలబెట్టుకున్నారు. గత పార్ల మెంట్ ఎన్నికల్లో రెండు ఎంపీలు గెలి చిన కాంగ్రెస్ ఇప్పుడు కూడా మూడురంగుల జెండా ఎగుర వేశా యి. అయితే నల్లగొండలో రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. కాoగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘు వీర్ రెడ్డి(Kundur Raghu Veer Reddy)అత్యధిక మెజార్టీల్లో దేశం లోనే మూడోస్థానంలో నిలవగా తెలంగాణలో మొదటిస్థానంలో నిలి చారు. అదే సందర్భంలో అంతే కాకుండా భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 6,29, 143 ఓట్లు బిజె పి అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ 4,010,973 ఓట్లు, బిఆర్ఎస్ అభ్యర్థి క్యామా మల్లేష్ కు 2,56, 187 ఓట్లు రాగా కిరణ్ కుమార్ రెడ్డి 2,22,170 ఓట్ల ఆధిక్యతతో గెలు పొందారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా లోని రెండు పార్లమెంట్లలోనూ హస్తం హవా కొనసాగింది.
తొలి రౌండ్ నుంచి కొనసాగిన ఆదిక్యత… లోక్ సభ ఓట్ల లెక్కిం పులో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి నల్లగొండ, భువనగిరి స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్(Congress) అభ్యర్థులు తొలి రౌండు నుంచే తమ ఆధిక్యత ను ప్రదర్శించారు. అటు నల్లగొండ(Nalgonda) ఇటు భువనగిరి రెండు పార్ల మెంట్ల లో కాంగ్రెస్ అభ్యర్థులు సునా యాసంగా విజయం సాధించారు. ఇదిలా ఉంటే భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి దామల కిరణ్ కుమార్ రెడ్డి 2.2 2,170 ఓట్ల మెజారిటీతో విజ యం సాధించారు. అయితే కమలం పార్టీ పరాజయం పొందగా గులాబీ పార్టీ రెండింటిలోనూ పరాభవం పొందింది. రెండు పార్లమెంట్లలోనూ భారతీయజనతా పార్టీ రెండోస్థానం లో నిలవగా బిఆర్ఎస్ పార్టీ అభ్య ర్థులు మూడోస్థానంకు పరిమితమ య్యారు . నల్లగొండ పార్లమెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 7,84,337 ఓట్లు, బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి 2,24,432.. బిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డికి 2,18,417 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఇద్దరు అభ్యర్థులు మొదటిసారి పోటీలో…నల్లగొండ, భువనగిరి పార్లమెంట్లలో కాంగ్రెస్ నుండి గెలు పొందిన ఇద్దరు కూడా కొత్తవాళ్ళే. కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి లు(Chamala Kiran Kumar Reddy)తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పొటి చేయడంతో పాటు మొదటిసారి లోక్ సభ ఎన్ని కల రణరంగంలో నిలిచారు. అయి తే ఏకంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి పార్లమెంట్ లోకి అడుగుపెడు తుండటంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఏది ఏమైనా మొత్తానికి నల్లగొండ జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఆ పార్టీ నాయకత్వం కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
Congress won in nalgonda and bhongir