constable suspended: అక్రమ వసూళ్లకు పాల్పడిన కానిస్టేబుల్ ని సస్పెండ్
విధి నిర్వహణలో అక్రమ వసూళ్లకు పాల్పడిన కేతపల్లి పోలీసు స్టేషన్ కి చెందిన కానిస్టేబుల్ పి. మహేష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎస్పి చందనా దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఉత్తర్వు లు జారీ
ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: విధి నిర్వహణలో అక్రమ వసూళ్లకు పాల్పడిన కేతపల్లి పోలీసు స్టేషన్ కి చెందిన కానిస్టేబుల్(constable) పి. మహేష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎస్పి చందనా దీప్తి(chandana deepthi) ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 28వ తేదీన కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తు న్న క్రమంలో విజయవాడ లో ఒక శుభకార్యానికి వెళ్లి హైద్రాబాద్ కు వస్తున్న వాహనంను తనిఖీ చేయ గా అందులో తొమ్మిది బీర్లు ఉన్నా యని వారి పై కేసు నమోదు చేస్తాం అని బెదిరించారు.
ఆ తరువాత వారి వద్ద నుండి ఆరువేల రూపా యలు డిమాండ్ చేసి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ ద్వారా ఫోన్ పే చేయిం చుకుని తీసుకునట్లు బాధితులు పిర్యాదు చేయగా విచారణ జరిపిన అనంతరం నిర్దారణ కావడంతో ఆదివారం సదరు కానిస్టేబుల్ నీ సస్పెండ్(suspended ) చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైన విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
constable suspended in bribe case