CPI:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సిపిఐ (cpi) (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు,భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పూణెం లింగన్న (Pune Linganna) 5వ వర్ధంతి సంద ర్భంగా నల్లగొండ పట్టణంలోని శ్రామిక భవన్ లో చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఈసందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నల్లగొండ పట్టణ కార్యదర్శి బొమ్మిడి నగేష్ (Bommidi Nagesh) మాట్లాడుతూ కామ్రేడ్ లింగన్న విప్లవోద్యమంలో అలుపెరుగని పోరాటాలు నిర్వహించారన్నారు. పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించాడని వారన్నారు.కామ్రేడ్ లింగన్న కూడు, గూడు ,నీడ లేని పేదలని ఐక్యం చేసి, భూమి లేని పేదలకు భూమి పంచాడని, ఎన్నో గ్రామాల నిర్మాణం చేశాడని గుర్తు చేశారు.
ఆ క్రమంలోనే దోపిడిదా రులు పెట్టుబడిదారులపై పోరాటం నేర్పాడని మోసం చేస్తున్న వ్యాపార స్తులని సమన్వయంతో కూర్చోబెట్టి మాట్లాడాడని ఆయన అన్నారు. పార్టీ నిబంధనలకు కట్టుబడి నిర్మాణం చేసి ప్రజలని ప్రతిఘటన పోరాటం వైపు మళ్ళించాడని చండ్ర పుల్లారెడ్డి (Chandra Pullareddy)వారసత్వంతో ఆయన పోరాటం చేశాడని వారు అన్నారు. లింగన్నను పట్టుకొని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నప్పటికీ చిత్రహింసల గురిచేసి కాల్చి చంపారని దానికి కారణం కన్జ సంపదపై కన్వేషణ కార్పొరేట్ శక్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యం ఒకటే ఈ బూటకపు ఎన్కౌంటర్ చేశారని వారు అన్నారు.లింగన్న ఆశయాల సాధన కోసం పోరాడాలని,అపుడే నిజమైన నివాళి అని వారు అన్నారు. అనoతరం కామ్రేడ్ లింగన్న కు సంతాపం ప్రకటించి మౌనం పాటించారు. ఈ కార్యక్ర మంలో ఇఫ్టూ నాయకులు రావుల వీరేశ్,జానపాటి శంకర్,చారి,కత్తుల చంద్రశేఖర్,చింతల వెంకట రమ ణ,క్రాంతి,దాశరథ,మొండి కత్తి సూరి, తదితరులు పాల్గొన్నారు.