CPI Support: ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి సిపిఐ మద్దతు
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న బిజెపిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని సిపి ఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
సిపిఐ కార్యాలయంలో మాజీ మం త్రి జానా రెడ్డి, అభ్యర్థి రఘవీర్ రెడ్డి లతో సిపిఐ నేతలు
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న బిజెపిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని సిపి ఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నల్ల గొండ పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వాలని బుధ వారం కాంగ్రెస్ సీనియర్ నాయ కులు, మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డి, అభ్యర్థి కుందూరు రఘువిర్, జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ లు నల్లగొండ సిపిఐ జిల్లా కార్యాలయం మగ్దుమ్ భవనంకు వచ్చి మద్దతు కోరారు.
ఈ సంద ర్బంగా పల్లా వెంకట రెడ్డి మాట్లా డుతూ దేశంలో బిజెపి పాలనకు వ్యతిరేకంగా కలసి వచ్చే లౌకిక ప్రజాతంత్ర శక్తులంతా ఏకమై ఇండియా కూటమి గా ఏర్పడింది అన్నారు. కూటమిలో పొత్తులో భాగంగా సిపిఐ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా సిపిఐ, కాంగ్రెస్ కలిసి పనిచేసి ప్రభుత్వాన్ని ఓడించిందని గుర్తు చేశారు. ఈసారి జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కూడా సిపిఐ కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తుందని కమ్యూనిస్టు కాంగ్రెస్ కలిస్తే గెలుపే తప్ప ఓటమి ఉండదన్నారు.
పార్లమెంట్ మొదటిసారి ఎన్నికల్లో కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో విజయం సాధించారని గుర్తు చేశారు. అంత మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువిర్ రెడ్డి ని గెలిపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు కాంగ్రెస్ లకు కంచుకోటగా ఉందని ఈ రెండు పార్టీలు ఎప్పుడు కలిసి పనిచేసిన అఖండ మెజార్టీతో నే విజయం సాధించారని గుర్తు చేశారు. తన కుమారుడు కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ ను గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి,గన్న చంద్ర శేఖర్, సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజ వాడ వెంకటేశ్వర్లు, నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి,లోడంగి శ్రవణ్ కుమార్, సీనియర్ నాయకులు మల్లేపల్లి అదిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి,బోల్గురి నర్సింహా,బంటు వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి వెంకటరమణ, గురిజా రామచంద్రం,టి వెంకటేశ్వర్లు, నల్పరాజు రామలింగయ్య , ఉస్టెల సృజన,అంతుల మాలిశ్వరి, కంబాల శ్రీను ఉస్టెల నారాయణ రెడ్డి,నూనె రామస్వామి లెనిన్ తదితరులు పాల్గొన్నారు.
CPI supports Congress candidate in elections