CPM: ప్రజా దీవెన నల్లగొండ టౌన్: నల్గొండ పట్టణంలో పలు వార్డుల లో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాల్లో ఏర్పడుతున్న గుంతలు వెంటనే పూడ్చి ప్రమా దాలు జరగకుండా ప్రజలను కాపాడాలని సీపీఎం జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం అన్నారు. శనివారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్యశాఖ అసిస్టెంట్ ఇంజనీర్ కు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా హశం మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో శివారు ప్రాంతాలైన 3,5,6,8,9,18,19, 21,25, వార్డుల లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు జరుగుతున్నవి.
పైప్ లైన్ వేసిన తరువాత పోసిన మట్టి కృంగిపోవడం గుంతలు పడుతున్నవి భూమికి ఎత్తుగా మాన్యువల్స్ కట్టడం వలన దాని చుట్టూ గుంతలు పడి ప్రమాదాలు జరుగుచున్నవి. బైకులు కింద పడడం అనేకమందికి కాళ్లు చేతులు విరగడం జరుగుతున్నది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మానం కోసం పైప్ లైన్ వేసిన వెంటనే మట్టి పూడ్చడం, మాన్యువల్స్ కట్టిన దగ్గర దానికి సమానంగా మట్టి పోయడం చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. కొన్ని చోట్ల నాణ్యత లేక మాన్యువల్ లు కూలి పోతున్న ఘటనలు కూడా ఉన్నవి. గతంలో నిర్మించిన ugd కి ఇంటికి లింక్ కలపడం కోసం తీసిన గుంతలు వెంటనే పూడ్చడానికి చర్యలు చేపట్టాలని కోరారు.
అధికారులు వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించి నాణ్యత ప్రమాణాలను కాంట్రాక్టర్లు పాటించే విధంగా, నిర్మాణం పూర్తి కాగానే వెంటనే గుంతలు పూర్చి ప్రమా దాలు జరగకుండా చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, కోట్ల అశోక్ రెడ్డి ,అవుట రవీందర్, కందుల అశోక్, గాదె నర్సింహ, ఊట్కూరు మధుసూదన్ రెడ్డి,అద్దంకి నర్సింహ, గంజి నాగరాజు, కందుల ఝాన్సీ, నారగొని యాదగిరి, వేముల వెంకన్న, మందడి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.