–ప్రజావాణిలో సిపిఎం వినతి
CPM: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: విలీన ప్రాంతమైన 11వ వార్డు అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటా యించాలని సిపిఎం (CPM)జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య కోరారు. గురువారం 11వ వార్డు కార్యాలయంలో నిర్వహిం చిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రత్యేక అధికారి జ్యోతి కి వార్డు సమస్యలపై (Ward problems) వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ 2013లో గ్రామ పంచాయతీ గా ఉన్న మామిల్ల గూడెం ప్రాంతాన్ని పట్టణంలో కలిపి పట్టణ వాసులుగా ప్రకటించి ఉన్న ఉపాది హామీని తొలగించారు తప్ప అభివృద్ధికి చర్యలు చేపట్టలేదని అన్నారు. రాజీవ్ గృహకల్ప నుండి కతాల గూడెం వరకు రోడ్డు గుంతల మాయమై ఉన్నదని దానికి వెంటనే డబుల్ సిసి రోడ్డు డ్రైనేజీ నిర్మాణం (Construction of double cc road ,drainage) చేయాలని, అర్బన్ కాలనీ గ్రౌండ్ కు ప్రహరీ గోడ నిర్మించి వాకింగ్ ట్రాకర్, ఓపెన్ జిమ్, క్రీడా సామాగ్రి ఏర్పాటు చేయాలని పిహెచసి సబ్ సెంటర్ కు డాక్టర్, అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు. ఖాతాల గూడెం స్మశాన వాటికకు ప్రహరీ గోడ, స్మశాన దిమ్మెలు ,వాటరు, బాత్రూములు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
దేవరకొండ రోడ్డు నుండి పాలకూరి సంతోష్ ఇంటి మీదుగా పనస చంద్రయ్య ఇంటి వరకు, మరియు కమ్యూనిటీ హాల్ (Community Hall) వరకు సిసి రోడ్డు నిర్మాణం చేయాలని కోరారు. 11వ వార్డులో ఎక్కువమంది ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ఇండ్లు మరియు గ్రామకంఠం సంబంధించిన ఇల్లు కాబట్టి ఇంటి పన్ను డిమాండ్ నోటీసు హోల్డర్ ఆఫ్ ద ప్రాపర్టీ అని మున్సిపాలిటీ వారు ఇంటి యజ మాని పేరు లేకుండా చేయడం సరికాదని ,వెంటనే ఇంటి యజ మాని పేరుతో ఇంటి పన్ను డిమాం డ్ నోటీసు ఇవ్వాలని కోరారు. గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు(road) సంతోష్ నగర్ లో అంతర్గత రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారని వెంటనే సంతోష్ నగర్ కాలనీలో అంతర్గత రోడ్ల నిర్మాణం డ్రైనేజీ చేపట్టాలని కోరారు. వర్షాకాలం సీజన్ ప్రారం భమవుతున్నందున పిచ్చి మొక్కలు చెత్తాచెదారాలు తొల గించి పారిశుధ్య నిర్వహణ చేయ డం కోసం వార్డుకు మున్సిపల్ కార్మి కుల సంఖ్య పెంచాలని కోరారు. పట్టణ అభివృద్ధికి ఆటం కంగా ఉన్న 565 జాతీయ రహ దారి బైపాస్ రోడ్డు నిర్మాణం ఆప్షన్ 3ను రద్దుచేసి మున్సిపల్ పరిధి బయట నుండి బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ (CPM Town Committee)సభ్యురాలు దండెంపల్లి సరోజ, శాఖ కార్యదర్శి పనస చంద్రయ్య , వార్డు ప్రజలు భిక్షమయ్య, వెంకన్న , వార్డు ప్రజావాణి అధికారులు ఆశ, అంగన్వాడీ, ఆర్.పీ ఎలక్ట్రిసిటీ హెల్పర్ వెంకట్ రెడ్డి , రమాదేవి, సునీత, సైదమ్మ, క్రాంతి, కవిత, మమత, నూర్జహాన్, తదితరులు పాల్గొన్నారు.