ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : సిపిఎం పానగల్ జోన్లోని 1వ,2వ వార్డులలో పెన్షన్ల కొరకు సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ నాయకులు తుమ్మల పద్మ, కోట్ల అశోక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు 6 రకాల గ్యారంటీల్లో భాగంగా పెన్షన్లు కూడా ఇస్తామని గత ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ల కన్నా ఎక్కువ మొత్తంలో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారం చేపట్టి సంవత్సరకాలం గడుస్తున్నా ఇప్పటివరకు వికలాంగులకు వృద్ధులకు వితంతువులకి ఏ ఒక్కరికి కూడాపెన్షన్లు ఇవ్వలేదు. అదేవిధంగా ఒంటరి మహిళలకు పెన్షన్లను ఇస్తామని అన్నారు ప్రభుత్వం వృద్ధులకు 4000 వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తామని చెప్పినమాటను మర్చిపోయారన్నారు. బోదకాలు వచ్చిన వారికి కూడా పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.
దరఖాస్తు చేసుకొని మూడు సంవత్సరాలు గడిచిపోతున్న ఇప్పటివరకు ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయకపోవడం వలన వృద్ధులకు వృద్ధాప్యంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నా కొడుకులు కూతుళ్లు పట్టించుకోని వారికి పింఛన్ రాక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు వితంతువులు భర్తలను కోల్పోయి కుటుంబాన్ని నడిపే దిక్కు లేక కూలినాలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారికి పెన్షన్ వస్తే కుటుంబానికి తోడ్పాటుగా ఉంటుందని వారు తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జనవరి 26 లోగా పెన్షన్లు వచ్చే విధంగా చూడాలని డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు మైళ యాదయ్య, గుండాల నరేష్, ఆకిటిలింగమ్మ, రుద్రక్షయాదయ్య,బాలయ్య, పిచ్చమ్మ, వెంకటయ్య, లింగమ్మ, భారతమ్మ ,పద్మ ,పిచ్చమ్మ వెంకటయ్య, నరసింహ, ఎల్లయ్య, నాగమ్మ, బిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.