CPM: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సిపిఎం (CPM) పోరాటాల ద్వారానే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు ఈరోజు తిరుగండ్లపల్లి తమ్మడపల్లి (Thirugandlapalli Thammadapalli) గ్రామ శాఖ ఆరవ మహాసభలు తిరుగండ్లపల్లి గ్రామంలో నీలకంఠం రాములు అధ్యక్షతన జరిగినవి. ముఖ్యఅతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ పాలకులు ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని అన్నారు రైతులు కూలీలు సమస్యలు పరిష్కారం కావడంలేదని తెలిపారు. ఎన్నికలలో అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కారం చేయడం లేదని తెలిపారు. శివన్నగూడెం లక్ష్మణమ్మాపురం రిజర్వాయర్లకు డిపిఆర్ ఆమోదించకపోవడం అన్యాయమన్నారు ప్రభుత్వం వెంటనే డిపిఆర్ ను ఆమోదించి ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు తాగునీరు అందించాలని డిమాండ్ (demand) చేశారు.
లేనిపక్షంలో ప్రజలు (the people)పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసే ప్రభుత్వాలు మెడలు వంచుతారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మహిళలకు నెలకి 2,500 మరియు ఇతర పథకాల సంగతి ఏమిటని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని అన్నారు రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలన్నారు.సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ మద్యం మతపదార్థాలు వేరులే పారుతున్నాయని మునుగోడు నియోజకవర్గంలోగా జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు ఊసే లేదని సంక్షేమ పథకాలు వెంటనే ప్రారంభించాలనే డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీ (Loan waiver of farmers)ఇంకా అనేకమందికి కాలేదని రుణమాఫీ చేయాలన్నారు. ధరణి రద్దు చేసిన తర్వాత ఒక్క భూమి సమస్య పరిష్కారం కాలేదని అనేక రసువులు లోటుపాట్లతో రైతాంగం దిక్కుతోచనే పరిస్థితిలో ఉన్నారని అన్నారు వెంటనే భూ సమస్యలను పరిష్కారం చేయుటకు ప్రభుత్వ ము చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు.మహాసభల ప్రా రంభ సందర్భంగా సిపిఎం జెండా ను చల్ల ముత్యాలు ఆవిష్క రించారు నీలకంఠం సత్తెమ్మ స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ శాఖ మహాసభలలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యా దయ్య సహాయ కార్యదర్శి నీల కంఠ రాములు కొట్టం యాదయ్య మహిళా సత్తయ్య చెల్లం ముత్యా లు దామెర లక్ష్మి గడగోటి వెంకటేష్ కాగు వెంకటయ్య నీలకంఠం లక్ష్మమ్మ సిరసన వాళ్ళ ఎల్లయ్య నీలకంఠ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.