Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CPM: డిండి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలి

–నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆగస్టు 9న జరిగే సదస్సును జయప్రదం చేయండి
–సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపు

CPM: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో దుర్భిక్షనికి గురయ్యే ము నుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు ఇవ్వడంలో పాలక పార్టీలు తీవ్ర నిర్లక్ష్యం చేశాయని ప్రాజెక్టుల డిపిఆర్ (dpr) ను ఆమోదించి నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని కోరుతూ ఆగస్టు 9న నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే సదస్సుకు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సిపిఎం (CPM) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి (Mudireddy Sudhakar Reddy)పిలుపునిచ్చారు. ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో మర్రిగూడ మండల కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అత్యధిక ఫ్లోరిన్ ఈ ప్రాంతంలోనే ఉన్నదని దీనివల్ల ప్రజల తీవ్రమైన అనారోగ్యాన్ని గురవుతున్నారని అన్నారు.

సాగునీరు లేకపోవడం వలన భూములు బీడులుగా మారాయని తెలిపారు. కూలీలు,ప్రజలు(Workers and people) గ్రామాలకు గ్రామాలు వలసలు పోయే పరిస్థితి దాపురించిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం గత పది సంవత్సరాల అధికారంలో కొనసాగిన ఫ్లోరిన్ బాధితుల గురించి ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ తాగునీరు, సాగునీరు అందించడానికి అవసరమైన డిండి ఎత్తిపోతల పథకాన్ని డిపిఆర్ ఆమోదించకపోవడం చాలా అన్యాయం అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జీవోఎంఎస్ నెంబర్ 105 ద్వారా డీపీఆర్ (dpr)ను ఆమోదించారని కానీ 107 జీవో ద్వారా డిండి ఎతిపోతుల పథకం డీపీఆర్ ను ఆమోదించలేదని తెలిపారు. మునుగోడు న దేవరకొండ నియోజకవర్గం ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినప్పటికీ డిండి ప్రాజెక్టు విషయంలో దృష్టి సారించలేదని ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే డిపిఆర్ ను ఆమోదించి తగినన్ని నిధులు విడుదల చేసి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పూర్తి కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఇటీవల సిపిఎం ఆధ్వ ర్యంలో ప్రాజెక్టుల పరిశీలన చేయ డం జరిగిందని అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రాజెక్టుల మంత్రి ఉత్త మకుమార్ రెడ్డి కలిసి వినతి పత్రం అందించినట్లు తెలియ జేశారు ఈ ప్రాజెక్టుల పూర్తి కి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆగస్టు 9న శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో (central)జరిగే సదస్సుకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయవల సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున బండ శ్రీశైలం మరిగూడ మండల కార్యదర్శి వేర్పుల యాద య్య నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి సిపిఎం నాయకులు బొట్టు శివకుమార్ మైల సత్తయ్య కొమ్ము లక్ష్మయ్య నీలకంఠం రాములు కొట్టం యాదయ్య దామెర లక్ష్మి మల్లేటి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.