క్రీడాకారులకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చెక్కులు అందజేత
ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : జిల్లాలో ప్రతిభా కలిగిన క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ అన్నారు.నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నల్లగొండ ప్రీమియర్ లీగ్ సీజన్- 5 పోటీలలో భాగంగా రెండవ రౌండ్ పోటీలను సోమవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురి క్రీడాకారులకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కింద మేమేంటో, చెక్కులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతిభకు వెలిగిన క్రీడాకారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.
నల్గొండ జిల్లాకు చెందిన క్రీడాకారులు వివిధ క్రీడా రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ జిల్లాకు ఎంతో పేరు తీసుకొస్తున్నారని అన్నారు.
ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ సీజన్- 5 క్రీడా పోటీలకు విశేష స్పందన లభిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి,
ఆర్గనైజర్స్ ముత్తినేని నాగేశ్వరరావు, బోనగిరి ప్రభాకర్, శ్రీధర్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల కోటి, గాలి నాగరాజు, మామిడి కార్తీక్, కోమటిరెడ్డి శేఖర్ రెడ్డి,కంచర్ల ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.