ప్రజాదీవెన, నల్గొండ టౌన్ :నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్ జి కళాశాలలో జరుగుతున్న నల్గొండ ప్రీమియర్ లీగ్ సీజన్-5 క్రికెట్ క్వార్టర్స్ దశకు చేరుకున్నాయి.ఈ క్రికెట్ పోటీలలో మొత్తం 64 టీములు పాల్గొనగా మంగళవారం వరకు 9 జట్లు క్వార్టర్ ఫైనల్ కు చేరాయి.ఈనెల 20న క్రికెట్ పోటీలు ముగియనున్నాయి.
మంగళవారం క్రికెట్ పోటీలను తిలకించిన అనంతరం నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ముగింపు వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 20న జరిగే ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఫైనల్ లో గెలుపొందిన జట్టుకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.2,00,116 లక్షల నగదు బహుమతి, ద్వితీయ జట్టుకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.1,00,116 లక్షల నగదు బహుమతి అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా మాన్ అఫ్ ద మ్యాచ్, మాన్ అఫ్ ది సిరీస్, ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు కూడా బహుమతులను అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, ఆర్గనైజర్స్ బోనగిరి ప్రభాకర్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, ఆంగోతు ప్రదీప్ నాయక్, ముత్తినేని నాగేశ్వరరావు, ఆలకుంట్ల మోహన్ బాబు, కోమటిరెడ్డి శేఖర్ రెడ్డి, పాలకూరి శ్రీధర్ ,రమేష్, ఏర్పుల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.*