Current shock: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ మున్సిపాలిటీ 18వ వార్డు లో పరిధిలో కొద్దిసేపటి ముందే శ్రీరామ్ నగర్ కాలనీ ఫెస్-2 రోడ్ నెంబర్-3 కి చెందిన కందగట్ల కృష్ణ గీతల కుమారుడు నవదీప్ ( 11) అనే అబ్బాయి బిల్డింగ్ పైన పతంగి ఎగరవేస్తూ కరెంటు షాక్కు గురై తీవ్రంగా గాయాల పాలయ్యా డు. వారి ఇంటి పక్కన ఉన్న కరెం టు తీగలకు పతంగి చిక్కడం తో దాన్ని తీయడానికి ఇనుపరాడుతో ప్రయత్నించి కరెంట్ షాక్ కు గురి కావడంతో యాభై శాతం శరీరం కాలిపోయింది. విషయాన్ని తెలుసుకున్న స్థానిక అవార్డు కౌన్సిలర్గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించడం జరిగింది.
అబ్బాయి ఆరోగ్య పరిస్థితి సీరియ స్ గా ఉండటంతో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. సందర్భంగా కౌన్సిలర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మీ పిల్లలు పతంగి ఆడుకోవడం ముఖ్యం కాదు వారి ప్రాణాలు ముఖ్యం మీ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.