Customs milling: కస్టమ్ మిల్లింగ్ లక్ష్యాన్ని పూర్తి చేయాలి
స్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్(సిఎంఆర్) లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశించారు.
నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన
ప్రజా దీవెన, నల్లగొండ:రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్(సిఎంఆర్) లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన(Dasari Harichandana) ఆదేశించారు.బుధవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో రైస్ మిల్లర్లతో 2023- 24 వానాకాలం, యాసంగి కష్టం మిల్లింగ్ రైస్ పై సమీక్షించా రు.2023- 24 వానకాలానికి సంబంధించిన సీఎంఆర్(CMR) ను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. కాగా జిల్లాలో వానకాలంలో మిల్లర్లకు ప్రభుత్వం 3,22,754 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వగా, 216816 మెట్రిక్ టన్నుల సి ఎం ఆర్ బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి సీఎంఆర్ రూపంలో ఇవ్వాల్సి ఉంది .
ఇందుకుగాను మిల్లర్లు లక్ష4 వేల451 మె. టన్నుల బియ్యం ఇచ్చారు. ఈ విషయం పై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తక్కిన 1,16,365 మె. ట సీఎంఆర్ ను సైతం వెంటనే చెల్లించాలని, ఇందుకుగాను సీఎంఆర్ చెల్లించే విధానాన్ని వేగవంతం చేయాలని అన్నారు .కొందరు మిల్లర్లు 40 శాతం కన్నా తక్కువగా ఉన్నారని అలాంటివారు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి త్వరితగతన చెల్లించేలా చర్యలు తీసుకోవా లన్నారు.15 రోజుల్లో పురోగతి కనిపించాలని అన్నారు. సీఎంఆర్ విషయంలో మిల్లర్లు(Millers)సీరియస్ గా ఉండాలని అన్నారు.
2023-24 యాసంగికి సంబంధించి ఇప్పటివరకు మిల్లర్లు 29812 మెట్రిక్(Metric) టన్నులు మాత్రమే ఇచ్చారని, తక్కినది సైతం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మిల్లర్లను ఆదేశించారు. యాసంగి సిఎంఆర్ ను వేగవంతం చేయాలని ఆమె చెప్పారు.రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్,ఎఫ్ సి ఐ జిల్లా మేనే జర్ సుశీల్ కుమార్ సింగ్ ,ఎఫ్ సి ఐ మేనేజర్ శ్రీనివాస్, జిల్లా పౌరస రఫరాల మేనేజర్ నాగేశ్వ రరావు, జిల్లా పౌర సరఫరా ల ఆధికారి వెంకటేశ్వర్లు(Venkateshwarlu)తదితరులు హాజర య్యారు.మిల్లర్ల ప్రతినిధులు మాట్లాడుతూ సాధ్య మైనంతవ రకు సీఎంఆర్ డెలివరీని ఎక్కువ మొత్తంలో చేసేందుకు ప్రయత్ని స్తామని తెలిపారు.
customs milling target completed in time