Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Dandampally Sattaiah: ఇందిరమ్మ కమిటీలను అఖిలపక్ష కమిటీలు గా మార్చాలి

Dandampally Sattaiah: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు లేని పేదలను గుర్తించడానికి ఏర్పాటు చేసే ఇందిరమ్మ కమిటీలను అన్ని పార్టీలకు, మహిళా సంఘాలకు, స్వచ్ఛంద సంస్థలకు (Parties, Women’s Associations, Voluntary Organizations) అవకాశం కల్పిస్తూ అఖిలపక్ష కమిటీలుగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారీ ఐలయ్య నల్లగొండ పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య (Dandampally Sattaiah) డిమాండ్ చేశారు. బుధవారం శ్రీనగర్ కాలనీ సిపిఎం శాఖా మహాసభ జరిగింది ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇండ్ల పంపిణీ చేయడానికి అర్హుల ను గుర్తించడం కోసం సమ భావన సంఘాల మహిళలు ఇద్దరు స్థానిక పెద్దలు ముగ్గురు కౌన్సిలర్ చైర్మన్గా స్పెషల్ ఆఫీసర్ కన్వీనర్ గా నియ మించాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని గుర్తు చేశారు.

ఆ కమిటీలను కాంగ్రెస్ కమిటీలుగా (Committees of Congress) మారు స్తూ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నిర్ణయించి అధికారులకు పంపడానికి చేస్తున్న ప్రయత్నాలను జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన పేదలకు ఇండ్లు ఇళ్లస్థ లాలు దక్కాలంటే ఇందిరమ్మ కమిటీలు, అఖిలపక్ష కమిటీలుగా (Indiramma Committees, All Party Committees) మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం వెంటనే రేషన్ కార్డులు పంపిణీ చేయాలని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో (Congress Manifesto) ప్రకటించిన విధంగా పెన్షన్స్ (Pensions) వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. మహాసభ ప్రారంభానికి ముందు సిపిఎం (CPM) అఖిలభారత కార్యదర్శి సీతారాం ఏచూరి, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య, తెలంగా ణ సాయుధ పోరాట యోధులు అనంతరామ శర్మ ,ప్రొఫెసర్ సాయి బాబా తదితర అమరవీరులకు లకు సంతాపం వ్యక్తం చేసి విప్లవ జోహార్లు అర్పించారు అనంతరం శ్రీనగర్ కాలనీ సిపిఎం శాఖ కార్యద ర్శిగా కన్నె కంటి సత్యనారాయణ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరి గింది. ఈ మహా సభలో కన్నె కంటి సత్యనారాయణ , ప్రసాద్ , సౌమ్య, నారి లక్ష్మి, చిర్రబోయిన మహేష్, మల్పరాజు అప్పయ్య, లక్ష్మీ ప్రస న్న, అరుణ్ తదితరులు పాల్గొ న్నారు.