Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Dandempalli Sattaiah: ఆశ వర్కర్లకు కనీస వేతనం నిర్ణయించాలి

Dandempalli Sattaiah: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఫిబ్రవరిలో జరిగే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1 8,000/-లు ఫిక్సిడ్ వేతనం నిర్ణ యించాలని. పిఎఫ్, ఈఎస్వి. ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటీయు జిల్లా సహాయ కార్య దర్శి దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవా రం నల్లగొండ పట్టణంలో ని మా న్యం చెల్క,లైన్ వాడ అర్బన్ ఆరో గ్య కేంద్రాలలో ఆశ వర్కర్స్ ధర్నా నిర్వహించి మెడికల్ ఆఫీసర్ల కు ఆశ వర్కర్ల సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ గత 15 రోజుల సమ్మె హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలు, ఫిబ్రవరి 9న, జూలై 30న ఆరోగ్య శాఖ కమీషనర్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరారు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఇన్సూరెన్స్ రూ.50 లక్షలు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని.

గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు మట్టి ఖర్చులు రూ.50 వేలు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. 5 లక్షలు చెల్లించాలి. ఇస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్ నిర్ణయించాలని. ప్రతి ఆదివారం మరియు పండుగలకు సెలవులు నిర్ణయించాలని కోరారు. ఆశాలకు ప్రతి సంవత్సరం 20 రోజులు వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు ఇవ్వాలని, ఆశాలకు 6 నెలలు వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశాలకు, ఏఎన్ఎం, జిఎన్ఎం పోస్టుల్లో ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని. వెయిటేజీ మార్కులు వెంటనే నిర్ణయించాలని,గత ప్రభుత్వ హామీ ప్రకారం ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

ఆశాలకు పూనమ్ క్లాత్తో కూడిన క్వాలిటీ యూనిఫామ్ మరియు ఎండాకాలంలో కాటన్ యూనిఫామ్ ఇవ్వాలని. ఆశాలు చేస్తున్న పారితోషికం లేని పనులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. 2021 జూలై నుండి డిశెంబర్ వరకు 6 నెలల సిఆర్సి ఎరియర్స్ వెంటనే చెల్లించాలి. 2022, 2023, 2024 సం॥ల లెప్రసీ సర్వే పెండింగ్ డబ్బులు వెంటనే చెల్లించాలని. 2024 మార్చి 3-5 వరకు 3 రోజుల పల్స్ పోలియో డబ్బులు చెల్లించాలి.జిల్లా అధికారులు ఆశాలతో స్ఫూటమ్ డబ్బాలను మోపించకూడదని పైనుండి నిర్దిష్టమైన సర్క్యులర్ జారీ చేయాలని. ఇప్పటివరకు లేని ఆసుపత్రుల్లో వెంటనే ఆశాలకు రెస్ట్రూం ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ మన్యం చెల్క , లైన్ వాడ అర్బన్ పి ఎస్ సి నాయకులు చింత వజ్రమ్మ, ప్రేమలత ,వీరభద్రమ్మ ,సబిత, సౌజన్య, టి స్వప్న, ఎం శోభ, ఎం సువర్ణ, షమీమ్, ఇద్దమ్మా తదితరులు పాల్గొన్నారు