Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DCP Vineet : మోస్ట్ వాంటెడ్ అరెస్ట్

–వరస దొంగతనాలతో మూడు రా ష్ట్రాల పోలీసులనుముప్పుతిప్పలు పెట్టిన దొంగ బ్రూస్లీ ఆటకట్టు
–ఇతనిపై 53కేసులు ఉండగా పలు మార్లు జైలుకు వెళ్లినా లేని మార్పు
–కేటుగాటు నెహామియా అలియా స్ బ్రూస్లీ పై పిడి యాక్ట్ పెడుతాం
–హైదరాబాద్ మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడి

DCP Vineet: ప్రజా దీవెన, హైదరాబాద్: ఆంధ్రప్ర దేశ్, తెలంగాణ, కర్ణాటక (Andhra Pradesh, Telangana, Karnataka) రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను నగర పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నా రు. వరస దొంగతనాలు చేస్తూ పోలీ సులను ముప్పుతిప్పలు పెట్టిన కేటుగాటు నెహామియా అలియాస్ బ్రూస్లీని చివరికి కటకటాల వెనక్కి నెట్టారు. చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 10వ తేదీన ఓ ఇంట్లో చోరీ జరిగింది. దీనిపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసిం ది. కేసు నమోదు (Registration of case) చేసిన పోలీసులు విచారణ చేపట్టి నింది తుణ్ని అరెస్టు చేశారు.

మూడు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్.. నెహామియా అలియా స్ బ్రూస్లీ (Nehemiah Alias ​​Brusley)అనే దొంగ ఆంధ్ర, తెలంగా ణ, కర్ణాటక పోలీసుల మోస్ట్ వాంటె డ్ లిస్టులో ఉన్నాడు. వరస దొంగత నాలు చేస్తూ పోలీసులకు చిక్కకుం డా తిరుగుతున్నాడు. అయితే ఇప్ప టికే ఇతనిపై మూడు రాష్ట్రా ల్లో కలిపి మెుత్తం 53కేసులు వరకు ఉన్నాయి. చోరీలు చేస్తూ ఇప్పటికే 10సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చా డు. అయినా అతనిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఒక రాష్ట్రంలో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు వేగవంతం చేస్తే మరో రాష్ట్రం వెళ్లి తలదాచుకునే వాడు. అలా మూడు రాష్ట్రాల్లో ఇప్పటికే లక్షల సొత్తు చోరీ చేశాడు.

మాదాపూర్ డీసీపీ వినీత్ కథనం ప్రకారం.. నిందితుణ్ని పట్టుకున్న అనంతరం మాదాపూర్ డీసీపీ వినీత్ DCP Vineet)మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 10న చోరీ జరిగినట్లు ఓ కుటుంబం ఫిర్యా దు చేసింది. దీనిపై వెంటనే కేసు నమో దు చేసి దర్యాప్తు ప్రారంభిం చాం. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ వివరాలు సేకరించింది. సీసీ కెమెరాల ఆధారంగా చోరీ చేసింది మోస్ట్ వాంటెడ్ బ్రూస్లీగా గుర్తించాం. పక్కా పథకం ప్రకారం అతడిని అరెస్టు చేశాం. ఇతనిపై ఇప్పటివరకూ 53కేసులు ఉన్నా యి. పలు మార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ఒకే సారి రెండు, మూడు ఇళ్లలో చోరీ చూసి వెళ్లిపోతుంటా డు. రాడ్లను ఉపయోగించి తాళం తీయడంలో నిందితుడు దిట్ట.

మూడు కమిషనరేట్ల (Three Commissionerates) పరిధిలో బ్రూస్లీపై అనేక కేసులు ఉన్నాయి. ఇతడిపై పీడీ యాక్ట్ కూడా పెడతాం. 13కేసు ల్లో నిందితుడికి కన్విక్షన్ కూడా వ చ్చింది. అరెస్టు అనంతరం అతని నుంచి 25తులాల బంగారం, 300 గ్రాముల సిల్వర్, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నాం. వీటి విలు వ రూ.25లక్షల వరకూ ఉంటుంది. నిందితుడిపై ఇప్పటికే ఏపీలో 9, సికింద్రాబాద్‌- 2, సైబరాబాద్‌- 17, హైదరాబాద్-12, రాచకొండ- 6 కేసులు ఉన్నాయి. కర్ణాటకలో మరో ఏడు కేసులు (Seven cases) నమోదు అయ్యాయి. బ్రూస్లీతోపాటు కురువ నాగేశ్ అనే మరో వ్యక్తిని కూడా పట్టుకున్నాం. మరో నిందితుడు పరారీలో ఉన్నా డు. అతని కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.