Municipal drinking water tank: మున్సిపల్ తాగునీటి ట్యాంకులో మృతదేహం
నల్లగొండ జిల్లా కేంద్రం మున్సిపాలిటీ పరిధిలో భయానక వాతావరణం ఉత్పన్న మైంది. పట్టణం లోని 11వ వార్డు పాత బస్తీ హిందూపూర్ లోని వాటర్ ట్యాంక్ లో వ్యక్తి మృత దేహం లభించడం కలకలం సృష్టిం చింది.
పది రోజులుగా ఆ నీటినే తాగు తున్న ఆ ప్రాంత ప్రజలు
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడు తున్నారని ప్రతిపక్షాల మండిపాటు
పూర్తిస్థాయిలో విచారణ చేసి నివే దిక సమర్పించాలని కలెక్టర్ హరి చందన ఆదేశం
ప్రజా దీవెన, నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రం మున్సిపాలిటీ పరిధిలో భయానక వాతావరణం ఉత్పన్న మైంది. పట్టణం లోని 11వ వార్డు పాత బస్తీ హిందూపూర్ లోని వాటర్ ట్యాంక్ లో(Water tank)వ్యక్తి మృత దేహం లభించడం కలకలం సృష్టిం చింది. పది రోజుల క్రితం తప్పిపో యిన వ్యక్తి అదే రోజు వాటర్ ట్యాం క్ లో పడి మృతి చెందినట్లు పోలీ సులు, ప్రజలు అనుమానిస్తున్నా రు. నాటి నుంచి ట్యాంకు నుంచి వచ్చే మంచినీళ్లనే పాతబస్తీ, హిం దుపూర్ తో పాటు పలు కాలనీలకు చెందిన ప్రజలు నిత్యం తాగుతుం డడం గమన్హారం, పోలీసుల కథనం ప్రకారం పా తబస్తీ హనుమాన్ నగర్ కు చెందిన ఆవుల వంశీకి చెందిన వంశీకృష్ణయాదవ్ (26)కు(Vamsi Krishna Yadav)అనారో గ్య సమస్యలతో పాటు మానసిక స్థితి కూడా సరిగ్గా లేకపోవడంతో గత 24వ తేదీన రాత్రి సమయం నుంచి వంశీకృష్ణ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు స్థానిక వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా రు.
అప్పటి నుండి కనిపించకుండా పోయిన వంశీ అదేరోజు రాత్రి సమ యంలో హిందూ పూర్ వాటర్ ట్యాంకులో దూకి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అ యితే కొద్ది రోజుల నుంచి ట్యాంకు నుంచి వస్తున్న మంచినీళ్లు తేడా ఉండడంతో 11వ వార్డు ప్రజలు వాటర్ సప్లై సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో మున్సిపల్ సి బ్బంది, స్థానికులు ట్యాంకులో వాటర్ ను చెక్ చేస్తున్న సమయం లో ట్యాంక్ లో వంశీకృష్ణ మృతదే హం లభ్యమైంది. ఈ క్రమంలో రోజుల తరబడి మంచినీటి ట్యాం కులను చెక్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ స్థానికులు మండిపడ్డారు. నీళ్లను అందించే విషయంలో ప్రజల ప్రాణాలతో చెల గాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నాగార్జు నసాగర్ మున్సిపల్ వాటర్ ట్యాంక్ లో(Nagarjunasagar Municipal Water Tank)30 కోతులు మృతి చెందిన ఘ టన మరువక ముందే నల్గొండ మున్సిపాలి టీలో మృతదేహం పది రోజులుగా ఉన్నా పరిశీలించ కపోవ డం దారుణమన్నారు.
ఇదిలా ఉం టే నల్లగొండ పట్టణంలో వాటర్ ట్యాంకులో శవం సంఘటనపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్రను విచారణ అధికారిగా నియమిస్తూ, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన(Collector Dasari Harichandana)ఆదేశాలు జారీ చేశా రు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి, నివేదిక సమ ర్పించా లని ఆమె ఆదేశించారు. ఇదిలా ఉంటే ఇది ప్రజాపాలన కాదని, ప్రజల ప్రాణాలతో చెలగాట మాడే పాలన అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండి పడ్డారు. కోతల్లేని కరెంట్ ఇవ్వలేరు, కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరు,కోతులు పడిచనిపోయి నా వాటర్ ట్యాంకులను పట్టించు కోరని , ఆఖరికి మనుషులు పడి చనిపోయినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని కేటీఆర్ తన ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమ ర్శించారు.
చివరికి నల్లగొండ నీటి ట్యాంకులో పది రోజులుగా శవం ఉన్నా నిద్రలేవరు అని విమర్శించా రు. సాగర్ ఘ టన స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే కాంగ్రెస్ సర్కారులో అదే నిర్లిప్తత అని పేర్కొన్నారు. సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కారిది ప్రజారో గ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిన గలీజు పాలన ఇది అని మండిప డ్డారు. మిషన్ భగీరథ పథకంతో(Mission Bhagiratha Scheme)దశాబ్దాల తాగు నీటి తండ్లాటను తీరిస్తే కనీసం నీటిట్యాంకుల నిర్వ హణ కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వమిది అని విమర్శించారు. ముమ్మాటికీ ప్రభుత్వ నిర్ల క్ష్యమే.. నల్లగొండ ఘటనపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. హిందూ పూర్ వాటర్ ట్యాంక్ లో మృత దేహం ఉన్నా ట్యాంక్ ను క్రమం తప్పకుండా పరిశీలిన చేయకుండా నీటిని సరఫరా చేసి ప్రజల ప్రాణా లతో చెలగాటమాడారు. ఇది ము మ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే.
ఆ నీటిని తాగిన ప్రజలు తీవ్ర ఆందోళ నకు గురవుతున్నారు. వేసవికాలం లో తాగునీటి సరఫరాపై ఎప్పటిక ప్పుడు సమీక్షించాల్సిన స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో అధి కారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ ట్యాంకు నీటిని తాగిన ప్రజలందరికీ వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలి. ఘట నకు బాధ్యులైన అధికారులపై విచా రణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం ఆయన జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులతో కలిసి ట్యాంకు వద్ద నిరసన వ్యక్తo చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,(Minister Komati Reddy Venkata Reddy)మున్సిపల్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Dead body in municipal drinking water tank