Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CPM : మతతత్వ బిజెపిని ఓడించండి

కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజల మధ్య చీలికలు చేస్తున్న మతతత్వ బిజెపిని ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.

మహిళలకు, మైనారిటీలకు రక్షణ లేకుండా పోయింది

భువనగిరిలో సిపిఎం, మిగతా 16 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించాలి

సిపిఎం పట్టణ సమావేశంలో ముదిరెడ్డి పిలుపు

ప్రజా దీవెన నల్లగొండ: కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజల మధ్య చీలికలు చేస్తున్న మతతత్వ బిజెపిని(BJP) ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నల్గొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో సిపిఎం పట్టణ విస్తృతస్థాయి సమావేశం పట్టణ కార్యదర్శి ఎండి. సలీం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి(Sudhakar Reddy) మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా అమ్మేస్తూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్న బిజెపిని పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని అన్నారు.

కార్పొరేట్ వ్యవసాయ విధానాన్ని తీసుకురావాలని చేస్తున్న కుట్రలను చేదిస్తూ ఢిల్లీలో(Delhi) రైతాంగ ఉద్యమం జరుగుతున్న కాలంలో కాల్పులు జరిపి రైతులను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. వామపక్ష పోరాటాల ఫలితంగా ఏర్పడిన ఉపాధి హామీ చట్టాన్ని నిధులు తగ్గించి నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం లో ఉద్యోగ అవకాశాలు లేక ఉన్న ఉద్యోగాలు పోవడానికి కారణమైందని అన్నారు. విద్యా, వైద్యంలో కార్పొరేట్ విధానాన్ని అవలంబిస్తూ బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న బిజెపిని ఓడించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి సిపిఎం మిగతా 16 చోట్ల ఇండియా కూటమి(India alliance) అభ్యర్థులు గెలిపించాలని సిపిఎం కేంద్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం లో రఘువీర్ రెడ్డి గెలుపు కోసం సిపిఎం(CPM) కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్(Congress) పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ బిజెపిని ఓడించి ఇండియా కూటమిని కేంద్రంలో అధికారంలోకి రావడానికి వామపక్షాల సహకారం ఎంతో అవసరమని అన్నారు. గతంలో యూపీఏ -1 వామపక్షాల సహకారంతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, గిరిజన హక్కుల చట్టం ప్రజలకు ఉపయోగపడే ఎన్నో చట్టాలను తీసుకొచ్చిందని అదేవిధంగా మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వామపక్షాల ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులు కావాలని కోరారు.

ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హశం, సీనియర్ నాయకులు ఊట్కూరి నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య , పుచ్చకాయల నర్సిరెడ్డి, తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, మైల యాదయ్య, దండెంపల్లి సరోజ, మధుసూదన్ రెడ్డి ,ఎస్కే మహబూబ్ అలీ, గాదె నరసింహ, భూతం అరుణ, పాక లింగయ్య, సలివొజు సైదాచారి, ఆకిటి లింగమ్మ, మారగోని నగేష్, గుండాల నరేష్, మారయ్య, యాదయ్య,గౌతమ్ రెడ్డి, దండెంపల్లి దశరథ,రుద్రాక్ష యాదయ్య, అన్నబిమోజీ పద్మ, తెలకలపల్లి శ్రీను,బుజ్జమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Defeat communal BJP says by CPM