–నల్లగొండ రెవిన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: జిల్లా లో ధరణి సమస్యల (Dharani problems) పరిష్కారంలో ఏ అనుమానం వచ్చినా క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని నల్ల గొండ రెవిన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ (Collector J. Srinivas) స్పష్టం చేశారు. గురువారం ఆయన కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ధరణి సమస్యలపై కలెక్టరేట్ లోని వివిధ విభాగాల అధిపతులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాము నిరంతరo అందుబాటులో ఉంటా మని, జాగ్రత్తగా, క్షుణ్ణంగా పరిశీలిం చి రైతులకు సత్వరమే పరిష్కారం అందేలా చూడాలని ఆదేశించారు. ధరణి సమస్యలను (Dharani problems) సత్వరమే పరిష్కరిం చాలని, మిస్సింగ్ సర్వే నెంబర్స్, పెండింగ్ మ్యుటేషన్స్, కోర్టు కేసులు, తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, ఏ మాడ్యూల్ వచ్చి నప్పుడు ఏ అంశాలను పరిశీలన చేయాలి అనే విషయాలతో రిమా ర్క్స్ తప్పులు లేకుండా రాయాల న్నారు. సమస్యలు ఎక్కడున్నా యో గుర్తించి చెక్ లిస్టులో పొందుప రచాలని సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో కలెక్టరేట్లోని విభాగాల అధిపతులు సిబ్బంది హాజరయ్యా రు.