Digital card survey: ప్రజా దీవెన, నల్లగొండ: వ్యక్తులకు ఆధార్ కార్డు ఉన్నట్లే కుటుంబానికి కూడా ఒక కార్డు ఉండాలన్న ఉద్దే శ్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కుటుంబ డిజిటల్ కార్డు (Digital card survey)ఇచ్చేందు కు నిర్ణయించిందని ,ఇందులో భాగంగానే గురువారం నుండి పైలెట్ పద్ధతిన జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక మున్సిపల్ వార్డు (Municipal Ward), ఒక గ్రామంలో సర్వేను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు. ఈ కుటుంబ డిజిటల్ కార్డు సర్వేను సర్వే బృందాలు శ్రద్ధతో, జాగ్రత్తగా నిర్వహించాలని, నిర్లక్ష్యం వహించవద్దని ఆయన కోరారు.
బుధవారం నల్గొండ లోని ఉదయాదిత్య భవన్ లో ఏర్పాటుచేసిన తెలంగాణ కుటుంబ డిజిటల్ కార్డు సర్వే బృందాల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆధార్ కార్డు ఎన్నో పథకాలకు తప్పనిసరి అయిందని,ఇది వ్యక్తికి మాత్రమే ఉపయోగపడుతున్నదని, అలా కాకుండా కుటుంబానికి కూడా ఒక కార్డు ఎందుకు ఉండకూడదు అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పైలట్ పద్ధతిన ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు . ఈ విషయమై కుటుంబ డిజిటల్ కార్డు అమలు చేస్తున్న రాష్ట్రాలలో రాష్ట్రస్థాయి సీనియర్ అధికారుల బృందాలు అధ్యయనం చేశాయని ఆయన తెలిపారు.
కుటుంబ డిజిటల్ కార్డు సర్వే లో భాగంగా ముందుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో (Assembly Constituency) ఒక చిన్న మున్సిపల్ వార్డు,అలాగే చిన్న గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందని,గురువారం ఉదయం 9 గంటలకు సర్వేను ప్రారంభించి 5 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 7 లోపు సర్వేను పూర్తిచేసి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. 150 గృహాలకు ఒక సర్వే బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో తహసిల్దార్ ,ఎంపీడీవో ,పట్టణ ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్, మండల స్థాయిలో అందుబాటును బట్టి మండల అధికారులు, ఒక ఫోటోగ్రాఫర్ చొప్పున బృందంలో నలుగురు ఉంటారని తెలిపారు. ధనిక, పేద తేడా లేకుండా ప్రతి కుటుంబానికి ఒక కార్డు ఇవ్వాలన్నది ఈ పథకం ముఖ్య ఉద్దేశం అని కలెక్టర్ (Collector)తెలిపారు. సర్వే నిర్వహించేందుకు సర్వే బృందాలకు ముందుగానే ఆయా గ్రామం, మున్సిపల్ వార్డుకు సంబంధించిన బేస్ డేటాను ఇవ్వడం జరుగుతుందని, దాని ప్రకారం సర్వే నిర్వహించాలని సూచించారు. ఆయా మున్సిపల్ వార్డులు, ఎంపిక చేసిన గ్రామంలో సర్వే నిర్వహించే విషయాన్ని ప్రజలకు ముందుగానే విస్తృతంగా తెలియజేయాలని, టాం టాం వేయించాలని,5 రోజులు సర్వే నిర్వహిస్తామని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు.
కుటుంబ డిజిటల్ కార్డు కోసం ప్రజలు వారి ఆధార్ కార్డుతో (Aadhaar card) సహా ( తప్పనిసరికాదు) సర్వే బృందాలకు అందుబాటులో ఉండి వివరాలను ఇవ్వాలని, ఆధార్ లేకుంటే ఇతర ఏదైనా గుర్తింపు ఇస్తే సరిపోతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఒక వ్యక్తి రెండు కుటుంబాలలో సభ్యులుగా ఉండకూడదని తెలిపారు. ఆధార్ నెంబర్ ఇచ్చినట్లుగానే కుటుంబ డిజిటల్ కార్డుకు ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుందని, అలాగే కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ఒక ఐడి నెంబర్ తో కార్డు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. సర్వే బృందాలు కుటుంబ వివ రాలుతోపాటు, సాధ్యమైనం తవరకు కుటుంబ సభ్యులందరు ఒకే ఫొటోలో వచ్చేలా ఫోటోను తీసుకోవాల ని,ఫోటో తీసే సమయంలో ఎవ రైనా కుటుంబ సభ్యులు అందు బాటులో లేనట్లయితే 5 రోజుల్లో తిరిగి ఆ ఇంటికి వెళ్లి ఫోటోను సేకరించాలని సూచించారు.
సర్వే బృందాలు (Survey teams) ప్రతి ఇంటికి వెళ్లాలని, ప్రతి కుటుంబం వివరాలు సేకరించాలని చెప్పారు. సర్వే ఆనంతరం ఎన్ని కుటుంబాలు, ఎంతమంది ఉన్నారో తెలుస్తుందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో కుటుంబ డిజిటల్ కార్డు సర్వే నాణ్యతగా ఉండాలని, వివరాలు సైతం కరెక్ట్ గా ఉండాలని అన్నారు.కుటుంబ డిజిటల్ కార్డు కు సంబంధించి బృందాలు ప్రజల ను ఎవరిని ఇబ్బంది పెట్టవద్దని, ఇది కేవలం కుటుంబ వివరాలు మాత్ర మే సేకరించి కుటుంబం మొత్తానికి ఒక డిజిటల్ కార్డు ఇవ్వడానికి చేస్తున్న సర్వే అన్న విషయాన్ని ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. కుటుంబ డిజిటల్ కార్డు (Family Digital Card)పై ప్రజలు అనవసరమైన అపోహలు ఆందోళనలు, చెంద కుండ సాధ్యమైనంతవరకు కుటుం బ సభ్యుల వివరాలు, ఫోటో ఇస్తే సరిపోతుందని చెప్పారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంస్థల టీ. పూర్ణచంద్ర , అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి ,గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, నల్గొండ ఇన్చార్జ్ ఆర్డీవో శ్రీదేవి, దేవరకొండ ఆర్డిఓ శ్రీరాములు, చండూరు ఆర్డీవో సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్లు ,తహసిల్దారులు, ఎంపీడీవోలు, సర్వే బృందాల సభ్యులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.