Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Distribution of cheques: సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ

Distribution of cheques:ప్రజా దీవెన, చింతపల్లి::నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ని ఎంపీడీవో కార్యాలయంలో (MPDO Office) జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ (Distribution of cheques)కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ (Balu Naik) ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. అర్హులైన 109 మంది లబ్ధిదారులకు 39లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ (CMRF)చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అంగిరేకుల నాగ భూషణ్, మాజీ ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్, మాజీ సర్పంచ్ ముచ్చర్ల గిరి, సినియర్ నాయకులు సంజీవరెడ్డి, మాజీ ఎంపిటిసి దోతి రెడ్డి, మాజీ జెడ్పిటిసి హరీ నాయక్, నర్సింహా, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.