ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఎంజియూ (mgu)రసాయన శాస్త్ర (Chemistry)ఆధ్యాపకులు దోమల రమేష్ పర్యవేక్షణలో ” సింథసిస్ క్యారెక్టర్జేషన్ బయోలాజికల్ యాక్టివిటీ అండ్ డాకింగ్ స్టడీస్ (Synthesis Characterization Biological Activity and Docking Studies), ఆఫ్ న్యూ 1, 3, 4 ఆక్సా డయా జోల్-2 అమీన్ ఆఫ్ 1,8 నాఫ్తెరిడి 3 ఫినాక్సి ఫినైల్ , టాలిల్ అండ్ స్కి ప్ బేస్ డెరివేటివ్స్” అంశంపై పరి శోధన చేసి తన పరిశోధన గ్రంథాన్ని సమర్పించి డాక్టరేట్ పట్టా అందు కున్నారు.
తన పరిశోధన ఫలితాల ను వివరిస్తూ ఈ ఉత్పన్నాలను యాంటీ క్యాన్సర్ యాంటీ ఫంగల్ (Anti Cancer Anti Fungal) మరియు ఆంటీ బ్యాక్టీరియల్ గా ఉపయోగించవచ్చునన్నారు. ఖదీర్ ప్రస్తుతం హైదరాబాదులోని (hyderabad) సివిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సీనియర్ ఆధ్యాపకులుగా సేవలందిస్తున్నా రు. సామాన్య కుటుంబం నేపథ్యం నుండి వచ్చిన ఖదీర్ అంచలంచ లుగా ఎదుగుతూ డాక్టరేట్ పట్టా అందుకోవడం గ్రామీణ పేదలకు స్ఫూర్తిదాయకం అని డా దోమల రమేష్ (ramesh)అన్నారు. తనకు పరిశోధన క్రమంలో సహకరించిన గురువులకు అధికారులకు కృతజ్ఞతలు తెలి పారు. ఈ సందర్భంగా అధికా రులు కుటుంబ సభ్యులు అభి నందనలు తెలిపారు.