Seeds: విత్తనాల కోసం ఆందోళన వద్దు
నల్లగొండ జిల్లాలోని పత్తితో పాటు ఇతర పంటల విత్తనాలు అందు బాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ హరిచందన తెలిపారు. గురువారం ఏడీఏ, ఎంఏఓ, ఏఈఓ లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి తగు ఆదేశా లు జారీ చేశారు.
నేటి నుండి క్రమంతప్పకుండా ఆకస్మిక తనిఖీలు
రైతులు డీలర్ల నుండి విధిగా రసీదులు పొందాలి
డీలర్లు అవకతవకలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు
టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లాలోని పత్తితో పాటు ఇతర పంటల విత్తనాలు అందు బాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ హరిచందన(Collector Harichandana)తెలిపారు. గురువారం ఏడీఏ, ఎంఏఓ, ఏఈఓ లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి తగు ఆదేశా లు జారీ చేశారు. ఎక్కడ రైతులకు ఇబ్బంది జరగకుండా ఎప్పటిక ప్పుడు సమీక్షలు నిర్వహించి విత్తనాలు(Seeds) అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో డీలర్ల నుండి తప్పక రసీదు పొందాలని తెలిపారు. రైతులకు ఏ విధమైన ఇబ్బంది కలిగిన సంబంధిత వ్యవసాయ శాఖ అధికారిని, లేదా సిబ్బందిని సంప్రదించాలని పేర్కొ న్నారు. ఎవరైనా డీలర్లు(Dealers) అవకత వకలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు.
ప్రతిరోజు మండల వ్యవ సాయ అధికారి తన పరిధిలో ఉన్న విత్తన డీలర్ షాపులను తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్, గ్రౌండ్ స్టాక్ నిలువల ధ్రువీకరణ చేయాలని సూచించా రు. 50 ప్యాకెట్ల కంటే ఎక్కు వగా విత్తనాలు కొనుగోలు చేసిన రైతు వివరాలు సేకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. బిజీ టు ప్రైవేట్ హైబ్రిడ్(Hybrid) కూడా ఒకే రకమైన నాణ్యత ప్రమాణాలు కలిగి ఉంటాయి. అందువల్ల రైతులు అందుబాటులో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయాలని, రైతులకు రైతు వేదిక(Farmers platform)ద్వారా సమా వేశపరచి అవగాహన కల్పించాలని ఆదేశిం చారు.
జిల్లాలో జిల్లాస్థాయి, డివి జన్ స్థాయి, మండల స్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికా రులతో విత్తన తనిఖీ బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని నేటి నుండి విధిగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించా ల్సిందిగా ఆదేశించారు. విధి నిర్వహ ణలో అధికారులు నిర్లక్ష్యం వాయించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటా మని ఈ సందర్భంగా హెచ్చరించారు. పచ్చి రొట్టె విత్త నాలు జిల్లాకు సరి పడా నిలువలు ఉన్నాయి. రైతులు(Farmers) ఆందోళన చెంద వద్దని తెలిపారు. అంతే కాకుండా అదనంగా పచ్చి రొట్టె విత్తనాలు మంజూరు చేయించామని పేర్కొ న్నారు. జిల్లా స్థాయిలో విత్తన సెల్ ఏర్పాటు చేశామని, ఇబ్బందున్న వారు 7288800023 ను సంప్రదిం చాలని తెలిపారు.
Don’t worry seeds collector hari chandana