ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్గొండ జిల్లాలో ఖరీఫ్ 2023- 24 సీఎంఆర్ ను సకాలంలో నూటికి నూరు శాతం పూర్తి చేయడం ,అలాగే రబి సిఎంఆర్ ను 82% పూర్తి చేయడం, అంతేకాక 2024-25 ధాన్యం సేకరణను ఏలాంటి ఇబ్బందులు లేకుండా సేకరించినందుకుగాను రాష్ట్ర పౌర సరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీ ,కమిషనర్ డి ఎస్ చౌహన్
నల్గొండ జిల్లా పారుసరఫరాల అధికారులను అభినందించారు.
బుధవారం ఆయన హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల పౌరసరఫరాల అధికారులతో 2023.24ఖరీఫ్,రబి సీఎంఆర్ ,దాన్యం సేకరణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
2023 -24 కు సంబంధించి సీఎంఆర్ డెలివరీని 15 రోజుల్లో పూర్తి చేయాలని పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. 2024 -25 ఖరీఫ్ కు సంబంధించి ధాన్యం సేకరణ లో అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది రైస్ మిల్లులను 15 రోజులకు ఒకసారి తనిఖీ చేయాలని, ప్రత్యేకించి ప్రైవేటు ధాన్యం కొనుగోలుదారులు, మిల్లర్స్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.