–సుమారు రూ.41 లక్షల విలువైన 163,620కేజీల గంజాయి, 4ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం
–వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి
DSP Sivaram Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: అక్రమంగా గంజాయి (ganja) రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాం డుకు తరలించారు. వారి వద్ద నుంచి రూ.40,90,500 విలువైన 81 ప్యాకెట్లలో ఉన్న 163.820 కేజీల గం జాయితో పాటు 4. సెల్ఫోన్లు, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక డి.ఎస్.పి కార్యాలయంలో శనివారం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో నల్లగొండ డీఎస్సీ కాలను శివరాంరె డ్డి (DSP Sivaram Reddy)ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. శనివా రం ఉదయం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డీఎ స్సీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో విశ్వసనీయ సమాచారం మేరకు తిప్పర్తి ఎస్ఐఐ రాజు తమ సిబ్బం దితో కలిసి తిప్పర్తిలో రైల్వే స్టేషను కు వెళ్లే హైవేపై వాహా నాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో మిర్యాల గూడ నుంచి హైదరా బాద్ వైపు వాహానాలు తనిఖీ చేస్తుండగా రెండు కార్లు ఒకదానివెనక ఒకటి వస్తుండగా అనుమానాస్పదంగా ఉండడంతో ఆ వాహానాలు ఆపి పోలీసులు తనిఖీ (Police check) చేశారు.
ఏపీ 28 బీఆర్ 0081 220 కారు, ఏపీ 2137 బీహెచ్ 7767 నెంబర్ కలిగిన మారుతి స్విఫ్ట్ డిజైరు కారులను తనిఖీ చేయగా ఐ 20 కారులో ఉన్న కాస్తే నర్సింహా, గోవిం ద్ శివపాల్ సింగ్‌లను పట్టు కోగా ప్రహ్లాద్ అనే వ్యక్తి కారు దిగి పారి పోయినట్లు పేర్కొన్నారు. అదే విధం గా వెనకాల వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారులో ఉన్న భీమరాజు, శివకోటి ఉమా మహేష్ (Bhimaraj, Sivakoti Uma Mahesh) వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించ గా కర్ణాటకకు చెందిన తమన్ అనే వ్యక్తి ఉత్వర్వుల ప్రకారం ఏపీలోని రాజమండ్రి దగ్గర గోకవరం ఆడవు లలో రెండు కార్లలో గుర్తు తెలియ ని వ్యక్తుల వద్ద 81 ప్యాకెట్లలో గంజాయిని కొనుగోలు చేసి అ రెండు కార్లలో వెనక డిక్కీలో వేసు కుని తమను డెలివరీ చేసేందుకు వెళ్తూ మార్గ మధ్యలో తిప్పర్తి పీఎస్ పరిధిలో పట్టుపడినట్లు వివరిం చారు.
ఈ గంజాయిని రవాణా చేసినందుకు గానూ వీరికి ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున తమన్ ఇచ్చే వాడని వారు పేర్కొ న్నట్లు డీఎస్సీ (dsc) తెలిపారు. గంజాయి ని పట్టుకున్న వారిని ఎస్సీ అభినం దించారు. పట్టుపడిన వారిలో హైద రబాద్ లోని బాచుపల్లి నిజాంపేట్ రాజీవ్ గాంధీ. నగర్ కాలనీకి చెంది న కాస్తే నర్సింహా, కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన గోవింద్ శివపాల్ సింగ్ వికారాబాద్‌లోని బాచుపల్లి నిజాంపేట్ కు చెందిన నల్లగంటి భీమారాజు, తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లికి చెందిన శివకోటి ఉమా మహేష్‌లను ఆరెస్టు చేయగా ప్రహ్లాద్, తమస్ అనే ఇద్దరు పరారీలో ఉన్నారు. సమావేశంలో శాలిగౌరారం సీఐ కొమిరెడ్డి కొండలొడి, తిప్పర్తి ఎస్ఐఐ డిరాజు, సిబ్బంది రాజీవ్, ముజీబ్, టాస్క్ ఫోర్స్ సీఐ రమేష్‌బాబు, ఎస్బలు మహేందర్, రామకృష్ణ సిబ్బంది ఉన్నారు పట్టుపడిన వారిలో హైదరబాద్ లోని బాచుపల్లి నిజాంపేట్ రాజీవ్ గాంధీ నగర్ కి చెందిన కాస్తే నర్సింహా, కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన గోవించ్ శివపాల్ సింగ్ వికారాబాద్‌లోని బాచుపల్లి నిజాంపేట్ కు చెందిన నల్లగుటి భీమారాజు, తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లికి చెందిన శివకోటి ఉమా మహేషాను ఆరెస్టు చేయగా ప్రహ్లాద్, తమస్ అనే ఇద్దరు పరారీలో ఉన్నారు.