Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DSP Sivaram Reddy: సాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం

–డిఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్స్
–బహిరంగ ప్రదేశాల్లో మందుబాబు లపై స్పెషల్ ఫోకస్
–సరైన ఆధారాలు,నెంబర్ ప్లేట్లు లేని 80 వాహనాలు సీజ్

DSP Sivaram Reddy:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP Sarath Chandra Pawar)ఆదేశాల మేరకు నల్లగొండ డిఎస్పీ శివరాంరెడ్డి అధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్స్ (Special drives) నిర్వ హిస్తూ నల్లగొండ పోలీసులు హడ లెత్తిస్తున్నారు. శనివారం రాత్రి పట్టణ వన్ టౌన్,టూ టౌన్, రూరల్ పోలీ సులు సంయుక్తంగా 14 ప్రత్యే క బృందాలుగా ఏర్పడి నాకాబందీ నిర్వహించి, సరియైన ఆధారా లు,నెం బర్ ప్లేట్లు లేని దాదాపు 80 వాహనాలు సీజ్ చేశారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిం చే 100 మంది యువకులను అదు పులో తీసుకొని వారి తల్లిదండ్రుల సమక్షంలో డ్రగ్స్, గాంజా, మద్యం లాంటి చెడు వ్యసనాల ద్వారా కలిగే నష్టాలను గురించి కౌన్సిలింగ్ నిర్వహించారు.

అనంతరం డిఎస్పీ శివరాంరెడ్డి (DSP Sivaram Reddy) మాట్లాడుతూ శాంతిభ ద్ర తల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్స్ (Special drives) నిర్వహిస్తున్నామ న్నారు. వారం రోజుల పాటు ఇదే తరహాగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహి స్తామని, ప్రజలకు అసౌకర్యం కలి గించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ బహిరంగ మద్యం (alcohol) సేవించే వారిపై, నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై (Vehicles without number plates)ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిం చారని తెలిపారు. బహిరంగ ప్రదే శాల్లో మద్యం తాగుతూ అసాంఘిక కార్యక్రమాలను పాల్పడినట్లు కని పిస్తే వెంటనే డయల్ 100 కు సమా చారం ఇవ్వాలని తెలిపారు.ఈ పోలీస్ స్పెషల్ డ్రైవ్ లో పట్టణ వన్ టౌన్ టూ టౌన్ సీఐలు డానియల్ కుమార్,ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, పట్టణ ఎస్సైలు రావుల నాగరాజు, శంకర్, రూరల్ ఎస్సై శివకుమార్, పట్టణ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.