Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Congress: విద్యావంతులు, మేధావులు కాంగ్రెస్ కు మద్దతు పలకండి

దేశం లో ఈ నెల 13 న జరిగే లోక్ సభ ఎన్ని కల్లో విద్యావంతులు, మేధావులు కాంగ్రెస్ కు మద్దతుగా నిలబడి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాయకత్వంలో అభ్యర్థి రఘువీరా రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు.

నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుం దూర్ రఘువీర్ రెడ్డిని గెలిపించాలి
రఘువీర్ రెడ్డిని గెలిపించి రాహు ల్ ను ప్రధాని చేయాలి
దేశంలో చట్టాలు అమలు కావా లంటే కాంగ్రెస్ గెలవాల్సిందే
కాంగ్రెస్ తోనే సమాచార హక్కు చట్టం సాధ్యo
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ వర్రె వెంకటే శ్వర్లు

ప్రజా దీవెన, నల్లగొండ: దేశం లో ఈ నెల 13 న జరిగే లోక్ సభ ఎన్ని కల్లో(Lok sabha elections) విద్యావంతులు(Educated), మేధావులు(intelligent people) కాంగ్రెస్ కు(Congress) మద్దతుగా నిలబడి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాయకత్వంలో అభ్యర్థి రఘువీరా రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. నల్లగొండ పట్టణంలోని లయన్స్ క్లబ్ భవ నంలో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు యర్రమాద కృష్ణారెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన కార్యక్ర మంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రె స్ పార్టీనీ విజయపథంలో నడిపిం చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయా లని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఐదు జాతీయ గ్యారెం టీ పథకాల్లో పేద మహిళలకు, రైతులకు, యువకులకు, శ్రామికు లకు, విభిన్న కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రతి పేద మహిళకు ఏడాదికి ఒక లక్ష రూపాయలు ఇవ్వడం అనేది కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. మహాత్మా గాంధీ దేశానికి స్వా తంత్రం తెస్తే, జవహర్ లాల్ నెహ్రూ దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. ఇందిరా గాంధీ బ్యాంకుల జాతీయకరణం చేయ గా, రాజీవ్ గాంధీ దేశానికి టెక్నా లజీ పరిచయం చేశారు. సోనియా గాంధీ సమాచార హక్కు చట్టం తీసుకురాగా,ఇదే తరహాలో రాహుల్ గాంధీ పేద ప్రజల అభి వృద్ధి లక్ష్యంగా ఐదు గ్యారెంటీ పథకాలు అమలు చేయడం అభినందనీయం అన్నారు.

సమాచార హక్కు చట్టం ప్రభు త్వానికి సంబంధించిన ప్రతి జీవోను అందరికి ఆన్లైన్ విధానంలో అందుబాటులో ఉండేలా, ఆన్లైన్ విధానంలో ఆర్టిఐ దరఖాస్తుల స్వీకరిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు. దేశ సమగ్రతను, దేశభక్తి, బహుళ జాతుల సంస్కృతులను, లౌకికవాదం, సమానత్వం రక్షించబడాలంటే దేశంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ప్రభుత్వం దీర్ఘకాలిక నిర్ణయాలు అమలు చేయడంతో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) విజన్ ను ముందుకు తీసుకుపోయే విధంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉందన్నారు.

కావున ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) నాయకత్వంలో రాష్ట్రంలోని ఎక్కువ లోక్ సభ స్థానాలు గెలిచే బాధ్యత తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ హాయాంలోనే లోక్ పాల్ చట్టం, సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, గృహహింస చట్టం, పేదలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇలా అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉండేందుకు, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించేందుకు సమాచార హక్కు చట్టం వచ్చిందన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా సమాజంలో జరుగుతున్న అవినీతిని బయటకు తీసేందుకు ఆర్టిఐ కార్యకర్తలు నిత్యం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టిఐ చట్టం వచ్చిన తర్వాత సామాన్యుడు గౌరవం పెంచిందని, గతంలో అధికారులు సామాన్యులను పరిగణలోకి తీసుకునేవారు కాదని, ఆర్టిఐ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత 140 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం అధికారులకు ఏర్పడిందన్నారు.

సమాచార హక్కు చట్టం కమిషనర్లను కొద్ది రోజుల్లోనే నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పేర్కొనడం హర్షనీయమన్నారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ కన్న కలలు నిజం కావాలంటే ఆర్టిఐ చట్టం పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారతదేశంలో గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను ప్రస్తుత పార్టీలు గుర్తించకపోవడం దారుణం అన్నారు. మేధావులు, ఉద్యోగులు, జర్నలిస్టులు అందరూ ఏకతాటిపై వచ్చి ప్రజాస్వామ్యంలో ఓటు పై ప్రజలకు అవగాహన కల్పిం చాలని ఆయన అన్నారు. ఓటు ద్వారానే మన దేశ అభివృద్ధి ఆధా రపడి ఉందని, దీనిని దేశంలోని యువత ప్రతి ఇంట్లో తమ కుటుం బ సభ్యులకు వివరించాలని ఆయన కోరారు. రాష్ట్ర నాయ కులు, ముఖ్య సలహాదారు గుమ్ముల మోహన్ రెడ్డి, నల్లగొండ పురపాలక సంఘం చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంలో రాజకీయ నాయకులు కూడా భాగస్వామ్యం కావాలని, ఆ దిశగా ప్రభుత్వాలు చొరవ చూపా లన్నా రు. కొందరు కేంద్రంలో ఇండియా కూటమిని ఓడించేందుకు ప్రయ త్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

దీనిని మేధావి వర్గం ఆలోచన చేసి, తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్ ఎం ఏ కరీం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పాలన పారదర్శకత ఉండేందుకు ఆర్టిఐ(RTI) చట్టాలు ప్రజలకు ఎంతో ఉపయోగప డుతున్నాయని వారు తెలిపారు. ఆ చట్టాలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. నల్లగొండ పురపాలక వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కోటగిరి దైవాధీనం మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సమగ్రంగా అమలు కావాలంటే ఆర్టిఐ కార్యకర్తలు కీలకంగా పని చేయాలన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు చట్టాలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గోనా రెడ్డి, వినోద్ రెడ్డి, ఖుర్షీద్ పాష, ముకుంద రెడ్డి, సత్యనారాయణ, హేమలత, సైదులు, రామకృష్ణ, శ్రీనివాస్, లక్ష్మి విద్యాసాగర్, అశోక్ రెడ్డి, వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Educated and intelligent people support Congress