Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Poor: పేదరికం చదువుకు అడ్డుకారాదు

పేదరికం చదువుకి అడ్డుకాదని అందుకు పేద విద్యార్థులంతా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారా యణ రెడ్డి అన్నారు.

ప్రజా దీవెన, కోదాడ: పేదరికం చదువుకి(education) అడ్డుకాదని అందుకు పేద విద్యార్థులంతా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారా యణ రెడ్డి అన్నారు. కోదాడ పట్టణానికి చెందిన ఎలమర్తి ప్రహర్షిణి ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో 470 గాను 466మార్కులు సాధించినది ఈ సందర్భంగా కాంగ్రెస్ (congress party) పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి వంగవీటి రామారావు కోదాడ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు అడ్వకేట్స్ కోటిరెడ్డి కొండల్ రెడ్డి వార్డ్ కౌన్సిలర్ కోలా లక్ష్మీ ప్రసన్న కోటిరెడ్డి తెలుగుదేశంపార్టీ నాయకులు ఉప్పగండ్లశ్రీనివాసరావు తదితరులు అభినందనలు తెలిపారు.

అనంతరం లక్ష్మీనారా యణ రెడ్డి మాట్లాడుతూ పేదరికంలో(poor) జన్మించిన ప్రహర్షిణీ మంచి క్రమశిక్షణతో(discipline) కష్టపడి చదివి మంచి మార్కులు సాధించటం అభినందనీయమని రెండో సంవత్సరంలో కూడా మంచి మార్కులు సాధించి కోదాడ పట్టణానికి ఆమె చదువుకున్న శ్రీ విద్య కళాశాల యాజమాన్యానికి కుటుంబ సభ్యులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు.

Education not blocked poor