Employees strike : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం నల్గొండ తరుపున సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మె తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు కలక్టరేట్ కార్యాలయంలో ఏఓకి మరియు జిల్లా విద్యా శాఖ అధికారికి సమాచారం అందించి విధుల్లో చేరుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని విభాగాల ఉద్యోగులకు మరియు పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు, పోలీస్ శాఖ,అన్ని రకాల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు, ప్రజాసంఘాల నాయకులకు గత నెల 10వ తేదీ నుండి ఈ నెల 06 వరకు 28 రోజులు కొనసాగిన నిరవధిక సమ్మెకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, ప్లానింగ్ బోర్డ్ కమిషన్ చైర్మన్ చిన్నా రెడ్డి మరియు ఏమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం చర్చలు జరిపింది.
పే స్కెల్ అమలు గురించి కేబినెట్ సబ్ కమిటీ లో అతి తొందరలోనే నిర్ణయం తీసుకుంటుంది అని హామీ ఇచ్చారు.ఆర్థికేతర అంశాలు వెంటనే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మరియు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలంగాణ కి పంపించి ఆమోదయోగ్యం అయ్యేలా చేస్తాం అని తెలిపారు. కావున టీఎస్ఎస్ యుఎస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ప్రభుత్వంపై దృఢమైన విశ్వాసంతో ఈ నిరవధిక సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తూ,విరమిస్తున్నామని తెలియజేస్తున్నాము. మీరు ఇచ్చిన స్ఫూర్తితో రానున్న రోజుల్లో మా యొక్క డిమాండ్ల సాధనలో ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటున్నాం.