Environmental protection: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరి నినాదం కావాలి
ప్రపం చ పర్యావరణ దినోత్సవాన్ని పుర స్కరించుకొని మహాత్మా గాంధీ యూనివర్సిటీ సైన్స్ కళాశాలకు చెందిన NSS- యూనిట్-2,3, 4 విభాగాల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రపం చ పర్యావరణ దినోత్సవాన్ని పుర స్కరించుకొని మహాత్మా గాంధీ యూనివర్సిటీ సైన్స్ కళాశాలకు(Mahatma Gandhi University Science in celebration of World Environment Day) చెందిన NSS- యూనిట్-2,3, 4 విభాగాల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ 2024 ప్రధాన అంశం భూ పునరుద్ధరణ ఎడా రీకరణ నిలుపుదల మరియు కరువు పరిస్థితులను సమర్థవం తంగా ఎదుర్కొనే పద్ధతులు మొక్కలు నాటడంతో ముడిపడి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్క లు విధిగా నాటడంతో పాటు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు. నానాటికి పర్యావరణ హానికర జీవనశైలి మానవాళితో (Eco-friendly lifestyle with humanity) పాటు సమస్త జీవకోటి సైతం ప్రమాద అంచున ఉందన్న సత్యాన్ని గ్రహించాలన్నారు. అనంతరం ప్రోగ్రాం అధికారులు మరియు అధ్యాపకులతో కళాశాల ఆవ రణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డి నేటర్ డా మద్దిలేటి, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ జి.సుధాకర్, బి. వీర స్వామి మరియు డాక్టర్ పి. శ్రీనివాస్ తదితర అధికారులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
Environmental protection needs everyone